వైసీపీలో కొత్త టెన్షన్.. అంతా జగన్ చేతుల్లోనే

వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. ఇందుకోసం భారీ ప్రణాళికలు రూపొందించుకుంటోంది. గత ఎన్నికల్లో ఘోర పరభావానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ అందుకు అనుగుణంగా అడుగులు వేయాలనుకుంటోంది. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను మరోసారి చేయకుండా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీకి నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. గెలుపు గుర్రాలను ఎంచుకుని వారినే బరిలోకి దింపాలని ఆ పార్టీ అధినేత అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దశలో ఓ సమస్య వైసీపీని కలవరపాటుకు గురిచేస్తుందట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైందట. ఈ సారి ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చోవాలని కలలు కంటున్న ఆ పార్టీ అధినేతకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయిందట.

ప్రస్తుతం వైసీపీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై జగన్ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఆ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల గురించి పట్టించుకోవడంలేదని, ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో అధిపత్య పోరు ప్రారంభం అయిందని సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న సమయంలో వైసీపీలో అప్పుడే టిక్కెట్ల పోరు మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా పార్టీలో వర్గవిభేదాలు తీవ్రమవుతున్నాయట. వైసీపీ కంచుకోటలుగా ఉన్న కొన్ని జిల్లాల్లో ఎన్నికలు సమీపించే కొద్దీ టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఒకే నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది నేతలు పోటీలో ఉండడంతో ఆధిపత్య పోరుకు దారి తీస్తోందని, దాని ఫలితంగా నేతల మధ్య దూరం పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఉండడంతో ఏం చేయాలో జగన్‌కు కూడా పాలుపోవడంలేదట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.