టీడీపీ ఎంపీల్లో కొత్త గుబులు!

ఏపీ అధికార పార్టీ ఎంపీల్లో కొత్త గుబులు మొద‌లైంది. కేంద్రంలో ప‌ట్టు సాధించేందుకు హోదా సంపాదించేందుకు ఎంపీ సీట్లు గెలుపుపై అధినేత చంద్ర‌బాబునాయుడు దృష్టిపెట్టారు. బీజేపీతో దోస్తీ క‌టీఫ్ చేసుకున్నాక‌.. మోదీపై గుర్రుగానే ఉంటున్నారు. ఏది జ‌రిగినా.. మోదీను విమ‌ర్శిస్తూ.. జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మార్చేందుకు బాబు య‌త్నిస్తున్నారు. రాజ‌కీయంగా ఇవ‌న్నీ కామ‌న్ అయినా.. బాబు మాత్రం 2019లో ఎంపీ సీట్లు వీలైన‌న్ని అధికంగా సొంతం చేసుకోవాల‌నే ప్లాన్ చేస్తున్నారు. ఇది గ‌మ‌నించిన వైసీపీ కూడా ఎంపీలుగా ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా చెప్పిన వారిని మార్చుతూ ఎత్తుకు పై ఎత్తులతో స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య సాగే ర‌స‌వ‌త్త‌ర పోరు. ఈ సారి కులాల ప్రాతిప‌దిక‌గానే ఉంటుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌మ్మ‌, కాపు, రెడ్డి వ‌ర్గాలుగా విడిపోతే.. ఎస్సీలు, బీసీలు ఎవ‌రి ప‌క్షం ఉంటార‌నేది నేత‌ల ముందున్న ప్ర‌శ్న‌. అందుకే దానికి త‌గిన‌ట్లుగా కులాల ఓట్లు బ‌య‌ట‌కు పోకుండా.. ఆ ప్ర‌భావం ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉండేలా బాబు ఎంపీ సీట్ల‌లో కొత్త‌వారిని నిల‌పాల‌ని భావిస్తున్న‌ట్లు సంకేతాలు వ‌స్తున్నాయి. విజ‌య‌వాడ మ‌ళ్లీ కేశినేని అంటున్నా చివ‌రి నిమిషంలో మార్చే అవ‌కాశాలూ లేక‌పోలేదు. గుంటూరు, న‌ర్స‌రావుపేట కూడా దాదాపు ఇలాగే ఉండ‌వ‌చ్చు.
ఎందుకంటే గ‌ల్లాజ‌య‌దేవ్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావుపై గ‌తంలో ఉన్నంత సానుకూల వాతావ‌ర‌ణం లేదు. క‌ర్నూలులో బుట్టాపేరు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అనంత‌పురంపై ప‌రిటాల శ్రీరామ్ ఆశ‌లు పెంచుకున్నారు. కానీ ఆయ‌న‌కు క‌ళ్యాణ‌దుర్గం అసెంబ్లీ సీటు ఇచ్చి బుజ్జ‌గించాల‌ని చూస్తున్నారు. అనంత‌పురం ఎంపీ సీటు జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్‌రెడ్డికి ఇవ్వాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ‌, రాజంపేట‌, ప్ర‌కాశం, రాజమండ్రి, కాకినాడ‌ల‌పై ఇప్ప‌టికే స‌స్పెన్స్‌. ఈ స్థానాల‌తోపాటు తిరుప‌తి, న‌ర‌సాపురంలోనూ కొత్త‌వారికి ఇవ్వ‌టం ద్వారా అన్ని వ‌ర్గాల‌కూ అవ‌కాశం క‌ల్పించాల‌నే ప్ర‌చారం చేసుకోవ‌చ్చ‌నేది టీడీపీ ఆలోచ‌న‌. ఇప్ప‌టికే క‌మ్మ ముద్ర‌తో టీడీపీ కొన‌సాగుతుంది. అయితే కుల‌ప‌ర‌మైన అవ‌గాహ‌న‌. అంతర్గ‌త పోరు జ‌రుగుతున్న స‌మ‌యంలో రాజ‌కీయంగా ల‌బ్దిపొందాలంటే.. కుల‌ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డాలి. 2019లో ఈ ర‌క‌మైన ప్లానింగ్‌తో ఎంపీ సీట్లు.. త‌ద్వారా ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోవ‌టం తేలిక అవుతుంద‌నేది బాబు వ్యూహంగా తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు. అయితే..  సీట్ల కేటాయింపు ప్ర‌స్తుతం కేసీఆర్ ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏపీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా చ‌విచూడాల్సి వ‌స్తుంద‌నే భ‌యం కూడా లేక‌పోలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.