ఏపీలో కొత్త పార్టీ.. జగన్ ప్లానేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ‘జన జాగృతి’ పేరుతో ఏర్పాటైన ఈ పార్టీని వైసీపీ తరపున విశాఖ జిల్లా అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత స్థాపించారు. విజయవాడలోని జ్యోతి కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె తన పార్టీని ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు కోసమే తాను ఈ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయం రెండు కుటుంబాల మధ్యే సాగుతోందని, మహిళలను ఎదగనివ్వకుండా అణగదొక్కుతున్నారని, అందుకే సామాన్య ప్రజానీకానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కొత్త పార్టీని ఏర్పాటు చేశానని గీత స్పష్టం చేశారు. అయితే ఈ పార్టీ ఏర్పాటు వెనుక వైఎస్ జగన్ ఉన్నారనే ఊహాగానాలు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్తపల్లి గీతలాంటి సామన్య నేత పార్టీ ఏర్పాటు చేసే సాహసం చేయలేరని, దాని వెనుక ఎవరో ఒకరు ఉండే ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలో ఇప్పటికే ప్రధానంగా నాలుగు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానమైన పోటీ ఉండగా.. జనసేన, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం అప్పుడు వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషించారు. అనూహ్యంగా ఆ జనసేన అధినేత టీడీపీకి మద్దతు ఇవ్వడంతో 2014లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అంటారు. ఇదే ఫార్ములాను ఇప్పుడ జగన్ అనుసరించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కొత్తపల్లి గీత ఏర్పాటు చేసిన పార్టీతో టీడీపీకి వచ్చే ఓట్లను చీల్చి 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఇంత ఎంతవరకు నిజమో తెలియాలంటే ‘జన జాగృతి’ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే వరకు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.