దేవినేని.. కేశినేని.. వల్ల‌భ‌నేని. . ఏందీ ర‌చ్చ‌?

కృష్ణా, గుంటూరు జిల్లాలు అధికార , విప‌క్ష రాజ‌కీయాల‌కు.. అధికార సొంతం చేసుకునేందుకు రాజ‌ధాని.  సామాజిక స‌మీక‌ర‌ణల రీత్యా.. ఇరు జిల్లాలు ఒక‌దానిపై మ‌రొక‌టి ప్ర‌భావం చూప‌గ‌ల‌గ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. బంధుత్వాలూ.. స్నేహాలు ఇవ‌న్నీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. క‌మ్మ‌, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ వ‌ర్గాల వారీగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తుంటాయి. అటువంటి కీల‌క జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త వైరం అధికార పార్టీకు ఇబ్బందిగా మారాయ‌నేది తెలిసిందే. ఇక్క‌డ మ‌రో కొత్త విష‌యం ఏమిటంటే.. నేత‌లు.. చంద్ర‌బాబు, లోకేష్ కోట‌రీల్లో చేరి చ‌క్రం తిప్ప‌టం ద్వారా తండ్రి వైపు కొంద‌రు త‌న‌యుడి వైపు మ‌రికొంద‌రు నేత‌లు చేర‌టంతో.. ఇది అధికారుల‌కు, సామాన్య కార్య‌క‌ర్త‌ల‌కు ఇబ్బందిక‌రంగానే  ప‌రిగ‌ణించిందట‌. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. 2019లో ఎంపీ సీటు వ‌స్తుందా ! రాదా అనే అనుమానంంలో ఉన్నార‌ట‌.
ఇక‌పోతే.. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లున్నాయి. పైగా అత‌డు జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ప‌క్షం కావ‌టం.. వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే అంశాన్ని కూడా వంశీ అంటే గిట్ట‌ని నేత‌లు చంద్ర‌బాబు వ‌ద్ద చిలువ‌లు, ప‌లువ‌లుగా మోస్తున్నారంటూ ప‌లుమార్లు వ‌ల్ల‌భ‌నేని త‌న అనుచ‌రుల వ‌ద్ద ఆవేద‌న వెలిబుచ్చాడ‌ట‌. ఇక దేవినేని ఉమా.. సాగునీటి మంత్రిగా సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌త్యేక  గుర్తింపు ఉంది. పైగా రాష్ట్రంలో దేవినేని కంటూ ప్ర‌త్యేక వ‌ర్గ‌మూ ఉంద‌నే ప్ర‌చార‌మూ ఉంది. జిల్లాలో మ‌రో నేత ఎదిగితే త‌న‌కు పోటీ అవుతార‌నే దేవినేని ఆలోచ‌న‌.. మిగిలిన నేత‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌నే స‌మ‌చారం. పైకి నేత‌లంతా కలిసే ఉన్నామ‌నే సంకేతాలు ఇస్తున్నా.. లోలోప‌ల మాత్రం.. నేత‌ల మ‌ధ్యే కాదు.. ఆయా వ‌ర్గాల మ‌ధ్య కూడా విబేధాలు తారాస్థాయికి చేరాయ‌ట‌. ఒక‌రి ఓట‌మికి మ‌రొక‌రు.. చాప‌కింద‌నీరులా ప్ర‌త్య‌ర్థుల‌కు తామంటే గిట్ట‌ని నేత‌ల గుట్టుమ‌ట్టు అంతా చేర‌వేస్తున్నారంటూ కూడా ఒక‌ర్నోక‌రు విమ‌ర్శించుకునేంత వ‌ర‌కూ  చేరింద‌ట‌. సీఎం చంద్ర‌బాబునాయుడు రంగంలోకి  దిగి ఎంత‌గా స‌ర్దిచెప్పినా.. ఆ ముగ్గురూ ఎడ‌మొఖం.. పెడ‌ముఖంగానే ఉంటున్నార‌ని స‌మాచారం. దీనిపై చంద్ర‌బాబు మున్ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది వేచిచూడాల్సిందే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.