ఆ పాత్రలు చేయనంటున్న నయనతార

న‌య‌న‌తార.  ”నీకు వ‌య‌సు అవ‌దు క‌దా?  జీవితాంతం డ్యూయెట్లు పాడుకుంటూ ఉండొచ్చు. కానీ నాకు వ‌య‌సైపోతోంది. పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని క‌ని.. వాళ్ళ‌తో ఆడుకోవాల‌ని ఉంది” అని న‌య‌న‌తార జైసింహా సినిమాలో హీరో నందమూరి బాలయ్యతో అంటుంది. బికినీ పాత్రలు, రోమాన్స్ సీన్స్ వద్దట. బాలయ్యతో  గ‌తంలో చేసిన ప్ర‌తీ సినిమాలో గ్లామ‌రస్ యాక్టింగ్ తో అందాల కనివిందు చేసింది. ముఖ్యంగా బికినీ పాత్ర చేయ‌డానికికైనా సై అంటే సై అంటూ పోటీ పడింది. కానీ ఇప్పుడు మాత్రం వద్దంటోంది. న‌య‌న‌తార ఏ సినిమా చేయాల‌న్నా నిర్మాత‌ల ఒప్పందం ప్ర‌కారం  సినిమా ప్ర‌మోష‌న్స్, ఆడియో లాంచ్ , టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మాల‌కు రాన‌ని ముందే చెప్పేస్తుంది. ఆ ష‌ర‌తుల‌కు నిర్మాత‌లు ఒప్పుకుంటేనే సినిమా చేస్తోంది. ఒప్పుకోక పోకే అంతే సంగతలు. చిత్తగించవలెను.

ఇప్పుడు న‌య‌నతార గురించి మ‌రో వార్త వచ్చింది. నయ‌న‌తార ఇప్పుడు అసలు గ్లామ‌ర‌స్ పాత్ర‌లు చేయ‌న‌ని చెప్పేస్తుంద‌ట‌. లేదంటే సినిమా చేయ‌నని చెబుతుందంటున్నారు. న‌య‌న‌తార‌లో ఇంత మార్పు ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తే సమాధానం దొరికింది. గ్లామ‌ర‌స్ గా యాక్ట్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డంలేద‌ట. గతంలో ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లినా ఆ తర్వాత వెనక్కు వచ్చేసింది. ఆతర్వాత నయనతార నటుడు శింబుతో చెట్ట పట్టాలు వేసుకుని తిరిగింది. అయినా అది ఎక్కువ కాలం సాగలేదు. ఇప్పుడు దర్శకుడు విగ్నేష్  శివ‌న్ తో గ‌త కొద్దికాలంగా ప్రేమ‌లో మునిగితేలుతోంది. వారి మ‌ధ్య ఉన్న ఒప్పందం ప్రకారమే గ్లామ‌ర‌స్ సినిమాల‌కు దూరంగా ఉండాలని  న‌య‌న‌తార‌ నిర్ణయించుకుందట.

తమిళ దర్శకుడు విగ్నేష్ శివాన్, అందాల తార నయనతార మధ్య బంధం బలపడుతోంది. నయనతారతో కలిసి తన పుట్టినరోజును ఇంత ఆనందంగా జరుపుకుంటాననుకోలేదు. కలలో కూడా వూహించలేదని తమిళ దర్శకుడు విగ్నేశ్‌ శివాన్‌ ఈ మధ్య కాలంలో ట్వీట్ చేశారు. అంతే కాదు…నయనతారలో ఇంత మంచి మనసు ఉందనుకోలేదని చెప్పారు. విగ్నేశ్‌ ,నయనతారలు న్యూయార్క్‌లో కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోలను విగ్నేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో  విషయం అందరికీ తెలిసిపోయింది.

‘నా జీవితంలో ఇలాంటి బర్త్‌డే ఉంటుందని కలలో కూడా వూహించలేదు. ఈ జీవితాన్ని ఇంత అందంగా తయారు చేసిన దేవుడికి, నా ప్రియమైన సన్‌షైన్‌కి (నయనతార) ముందుగా ధన్యవాదాలు.’ అని ట్వీట్‌ చేశారు. నయన ఇకనైనా వదిలి పెట్టవద్దు. బంధం పెళ్లి పీటల వరకు రానివ్వు అంటూ ట్వీట్లు చేశారు ప్యాన్స్. ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డ నయన దీన్ని అయినా నిలుపుకుంటుందో లేదోననే చర్చ సాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.