ధర్మపోరాట సభలో మంత్రి నారా లోకేష్…

ధర్మ పోరాటానికి మేము రెడీ… మీరు రెడీనా…?

ఎత్తిన పసుపు జెండా దించకుండా,మడమ తిప్పకుండా తెలుగు దేశం పార్టీ కి కంచుకోటలాగా కాపలా కాస్తున్న కార్యకర్తలందరికి వందనం,పాదాభివందనం…

జాతీయ పార్టీ తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుతుంది అని ఆ రోజు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాం

రాష్ట్రంలో బీజేపీకి పెద్ద బలం లేదు

బీజేపీకి రాష్ట్రంలో బలం ఉందని పొత్తు పెట్టుకోలేదు. కేవలం ప్రత్యేక హోదా కోసం, ఇచ్చిన 18 హామీలను అమలు చేస్తారు అనే నమ్మకంతో పొత్తు పెట్టుకున్నాం

మూడు సంవత్సరాల 9 నెలలు ఓపిక పట్టాం

మొదటి సంవత్సరం హోదా ఇస్తాం అన్నారు

రెండో ఏడాది ఇదిగో ఇస్తున్నాం అన్నారు

మూడో సంవత్సరం హోదా ఎవ్వరికీ ఇవ్వడం లేదు. హోదా కు మించిన ప్యాకేజ్ ఇస్తాం అన్నారు

ముందు ఏఐఐబి కింద అప్పు ఇస్తాం అన్నారు,ఆ తరువాత నాబార్డ్ కింద నిధులు ఇస్తాం అన్నారు.ఆ తరువాత స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులు ఇస్తాం అన్నారు

నాలుగో సంవత్సరం ఇతర రాష్ట్రాలకు హోదా ఇచ్చి మనకు మాత్రం నమ్మక ద్రోహం చేసారు

16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా,ప్రజలకు లోటు లేకుండా మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారు

అటు సంక్షేమం,ఇటు అభివృద్ధి…ప్రతి అంశంలోనూ ఇతర రాష్ట్రాలు అసూయపడే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు

24 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసాం

24 గంటల విద్యుత్ ఇస్తున్నాం

డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు 10 వేల రుణమాఫీ చేస్తాం అని హామీ ఇచ్చాం

ఇప్పటికే 8 వేలు వేసాం.మరో 2 వేలు త్వరలోనే మీ అకౌంట్ లో వేస్తాం

చాలి చాలని పెన్షన్ ను మీ పెద్ద కొడుకు చంద్రబాబు గారు
ఒకే సంతకంతో 5 రేట్లు పెంచి 1000 రూపాయిలు ఇస్తున్నారు

ఒక ఎకరం పొలంలో పెట్టుబడి పెట్టి,సాగు చేసి,వాతావరణం అనుకూలిస్తే వచ్చే ఆదాయం మీకు పెన్షన్ రూపంలో ఇస్తున్నారు

68 ఏళ్ల వయస్సులో ఇంత కష్ట పడుతుంటే చూసి అభినందించి,ప్రత్యేక హోదా ఇచ్చి మరింత ప్రోత్సహించాల్సింది పోయి బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుంది

ఇంత నీచ రాజకీయాలు అవసరం లేదు.మీది జాతీయ పార్టీ అటల్ బిహారి వాజపేయ్,అద్వానీ లాంటి గొప్ప నాయకులు నడిపిన పార్టీ…రాజకీయం డైరెక్ట్ గా చెయ్యండి. దొంగ అబ్బాయి తో కలిసి,దొంగ రాజకీయలు చెయ్యాల్సిన అవసరం లేదు

12 కేసుల్లో ఏ1 ముద్దాయి,420 జగన్.ప్రతి శుక్రవారం కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడే ఖైదీ నెంబర్ 6093 మీకు గొప్ప నాయకుడు అనిపిస్తే అతనితోనే పొత్తు పెట్టుకోండి

కానీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దొంగల పార్టీతో చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చెయ్యకండి

హోదా ఇవ్వాల్సింది ప్రధాని
మోదీ, హోదా ఇవ్వనిది ప్రధాని.
అలాంటిది మోదీ గురించి మాట్లాడే దమ్మూ,ధైర్యం ప్రతిపక్ష నాయకుడు జగన్ కి లేదు…

నిరంతరం రాష్ట్ర కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి పై జగన్,బీజేపీ నాయకులు విమర్శలు చెయ్యడం వెనుక ఉన్న క్విడ్ ప్రో కో రాజకీయం గురించి ప్రజలకు అర్థం అయ్యింది

బీజేపీ కి నేను సవాల్ విసురుతున్నా.నా పై ఆరోపణలు చెయ్యాలి అనుకుంటే నేను ఎక్కడ తప్పు చేసానో,ఎప్పుడు తప్పు చేసానో,ఎలా తప్పు చేసానో సాక్షాధారాలతో సహా ధైర్యంగా చెప్పండి.అంతేగానీ అర్థం పర్థం లేని ఆరోపణలు చెయ్యొదు.

నా వయస్సు 35 ఏళ్ళు ఇంకో నలభై ఏళ్లు ఇదే రాష్ట్రంలో రాజకీయాల్లో ఉంటాను.మరో సారి చెబుతున్నా … మా తాతగారు,నాన్న గారి అంత మంచి పేరు నాకు వస్తుందో లేదో తెలియదు కాని వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను

బీజేపీ,వైకాపాలు ఎన్ని కుట్రలు చేసినా 2019 లో టిడిపి గెలవడం ఖాయం.
25 కి గాను,25 ఎంపీలు గెలిచి
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి హోదా తో పాటు…ఇచ్చిన 18 హామీలు సాధిస్తాం

తెలుగు జాతితో పెట్టుకున్న ఇందిరా గాంధీ లాంటి నాయకురాలికే తెలుగువాడి సత్తా ఏంటో చూపించాం.మెజార్టీ ఉన్న అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిని పదవి నుండి తప్పిస్తే తెలుగు జాతి గర్జించింది…ఆ గర్జన తట్టుకోలేక ఇందిరా గాంధీ అన్నగారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టింది

రాష్ట్రానికి అన్యాయం చేసింది అని 132 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు డిపాజిట్లు లేకుండా చేసారు

ఇప్పుడు మరో సారి తెలుగు జాతి పై బీజేపీ కుట్ర చేస్తుంది…కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీ కి పడుతుంది

కులం,మతం,ప్రాంతం పేరుతో మన మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బీజేపీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ సారి సహకరించాం.అడిగిన పదవులు అన్ని ఇచ్చాం.అయినా మనల్ని మోసం చేసారు

ఎన్డిఏ నుండి బయటకు వచ్చిన వెంటనే రాయలసీమ డిక్లరేషన్ తీసుకొచ్చారు

గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రాయలసీమను అభివృద్ధి చేస్తున్నారు

ఇంత కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని 2019 భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిని చెయ్యాలి

 

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.