ప్రత్యేక ఆకర్షణగా నారా దేవాన్షు

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సొంతూరులో నందమూరి, నారా కుటుంబాలు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాయి. తన స్వ‌గ్రామంలో పండుగ జరుపుకోవడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తోంది. ఈ సంక్రాంతిని కూడా చంద్ర‌బాబు ఫ్యామిలీ అక్క‌డే జ‌రుపుకుంటోంది. కాకపోతే ఈ సారి బుడ్డ‌ోడే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. బుడ్డోడు అంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు. నారా చంద్రబాబు, నందమూరి బాలయ్యల ముద్దుల మనవుడు దేవాన్షు. అక్కడ హడావుడి అంతా ఆయన మనవడు దేవాన్ష్‌దే. తాతయ్య బాలయ్యతో కలిసి ఎద్దుల బండి ఎక్కి ఊరంతా తిరిగొచ్చాడు. ఆ తర్వాత మరో తాతయ్య చంద్రబాబుతో కలిసి హెరిటేజ్ కు వెళ్లారు. మరోవైపు తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు సంప్రదాయ బద్దంగా పంచె కట్టులో వెళ్లారు. అందరినీ ఆకట్టుకున్నాడు.

పండ‌గ కార్య‌క్ర‌మాల్లో దేవాన్ష్ ఏకంగా ఎద్దుల బండి తోలి ఆక‌ట్టుకున్నాడు. రైతులా చ‌ర్నాకోల తిప్పుతూ హ‌ల్ చ‌ల్ చేశారు. బోగి రోజున పంచ క‌ట్టు ధ‌రించి తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నానికి వెళ్లిన దేవాన్ష్, సంక్రాంతి రోజున సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో బుడి బుడి అడుగులు వేశారు. ఫలితంగా దేవాన్ష్ ను చూసేందుకు ఊరి జనం అటువైపు వచ్చారంటే నమ్మండి. సంప్ర‌దాయ దుస్తులలు వేసుకుని ఆ బుడ్డోడు చేసిన హంగామా నారావారిప‌ల్లె వారిని బాగానే ఆకట్టుకుంది. పోయినేడు మరీ చిన్నోడు కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయిపోతున్నాడు కదా..అందుకే కాస్తంత ముద్దు ముద్దు పనులు చేస్తున్నాడు.

నారా, నందమూరి కుటుంబాలు, బంధువులు అంతా ఒకే చోట చేరడమే ఒక పండుగ. అలాంటిది వారి వారసుడు ఇలా చేస్తున్నాడని తెలిస్తే ఇంకా సంబరం ఉంటోంది. ఇప్పుడు అందరి చూపు దేవాన్ష్‌పైనే ఉన్నాయి. ఇక చంద్రబాబు, లోకేష్ స్నేహితుల కుటుంబాలకు చెందిన వారు దేవాన్ష్‌ను ముద్దు చేస్తున్నారు. మరోవైపు దేవాన్ష్ కు ఏం కాకుండా నాయనమ్మ భువనేశ్వరి దిష్టి తీసిందట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.