పురుష కమిషన్ కావాలట

రాజకుమారి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో పురుషులకు రక్షణ కరువు అవుతోందట. అందుకే ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి పురుషల కోసం కమిషన్ వేయాలంటున్నారు. భార్యలు, ఆడపడుచులు, మహిళల నుంచి రక్షణ పొందేందుకు ఈ కమిషన్ పని చేస్తుందని చెప్పారామె. వినడానికి విడ్డూరంగా ఉన్నా నిజమది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పురుషుల పై దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనల ఆధారంగా నన్నపనేని రాజకుమారి స్పందించారు.

ఉత్తరాంధ్రలో పురుషులపై మహిళలు దాడి చేసిన ఘటనలు చూసి ఆమె చలించిపోయారు. అందుకే పురుష కమిషన్‌ వేయాలని కోరారు. . భర్తను చంపిన, చంపబోయిన ఘటనలు చాలా జరుగుతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాలన్నారు. వయసు మీదపడింది కదా…నన్నపనేని రాజకుమారి ఇలా మాట్లాడుతుందే అనుకుంటున్నారు అంతా. కానీ నేను నిజంగానే చెబుతున్నాను. . శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. మహిళలపై టీవీ డైలీ సిరియళ్ల ప్రభావం పడుతోందన్నారు. అందుకే వారిలో క్రూరత్వం పెరుగుతోందని.. టీవీ సీరియల్స్‌పైనా సెన్సార్‌ పెట్టాల్సి ఉంటుందని నన్నపనేని కోరారు. ఎలా పురుషులను చంపవచ్చో ప్రత్యేకంగా చూపించి మరీ చెబుతున్నారు. అలాంటి పరిస్థితి పురుషులకు రాకూడదని చెప్పారు నన్నపనేని. ప్రియుడు కోసం హైదరాబాద్ లో భర్తను చంపించింది భార్య. ఆ తర్వాత ప్రియుడు ముఖం పై యాసిడ్ పోయించింది. అత్తకు అనుమానం రావడంతో గుట్టు రట్టు అయింది. మహబూబ్ నగర్ వంటి చోట్ల అలాంటి సంఘటనలే జరిగాయి. అందుకే పురుషల కమిషన్ రావాలంటున్నారు. భార్య బాధితుల సంఘాలు ఉన్న సంగతి గుర్తు చేస్తున్నారు నన్నపనేని.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.