శ్రీరెడ్డి గాలానికి.. నాని చిక్కిన‌ట్టేనా!

మిడిల్ క్లాస్ అబ్బాయిగా.. ఏవోనాలుగు సినిమాలు.. ఐదు పాట‌ల‌తో సాగే యాక్ట‌ర్ సారీ.. బిగ్‌బాస్ సీజ‌న్ 2 హాట్‌బాయ్‌.. నాని ఇప్పుడు ఊహించ‌ని క‌ష్టాల్లో చిక్కాడు. ఎప్ప‌టి నుంచో.. శ్రీరెడ్డి విసిరిన గాలానికి చిక్కి బ‌య‌ట‌ప‌డ‌టం ఎలాగో తెలియ‌లేక‌.. విల‌విలాడుతున్నాడు. తొలి ఎపిసోడ్‌తో ర‌క్తిక‌ట్టించిన శ్రీరెడ్డిని.. ఇప్పుడు మీడియా క‌న్నెత్తి చూడ‌ట్లేదు. పైగా అండగా ఉంటాయ‌నుకున్న ఛానెళ్లు ముఖం చాటేశాయి. ప‌వ‌న్‌ను తిట్ట‌మ‌న స‌ల‌హా కుమ్మ‌రించిన వ‌ర్మ కూడా.. పాపం ఆఫీస‌ర్ అట్ట‌ర్‌ప్లాప్‌తో వైరాగ్యంలోకి చేరార‌ట‌. బ‌య్య‌ర్ల‌కు పైస‌లు ఎవ‌రిస్తారు.. ఎలా ఇవ్వాల‌నేది కూడా మ‌రో బాధ గా మారింద‌ట‌. ఈ సినిమాకు నాగార్జున‌కు  ఇచ్చిన రెమ్యునురేష‌న్‌లో ఐదోవంతు డ‌బ్బులు కూడా రాలేద‌ట‌. ఇక‌.. ఆయ‌న క‌ష్టాల‌తోనే ఆయ‌న‌కు స‌రిపోతుంటే. ఇక ఛీరెడ్డి గురించి ఆలోచించే తీరికెక్క‌డ‌.

 

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ సైలెంట్ గా వున్న రెడ్డ‌మ్మ ఒక్క‌సారి వ‌యిలెంట్‌గా మార‌టానికి ప్ర‌ధాన కార‌ణం.. బిగ్‌బాస్ 2లో ఆమెకు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌టం. ఎందుకంటే.. గ‌త పాపులారిటీతో బిగ్‌బాస్ స్థానం గ్యారంటీ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. దీంతో త‌న‌కు అన్నీ సెట్ అవుతాయ‌ని భావించి శ్రీరెడ్డి చివ‌ర్లో త‌న పేరు లేక‌పోవ‌టంతో దిమ్మ‌తిరిగిపోయింద‌ట‌. ఎలాగైనా.. దీనికి స‌మాధానం చెప్పాల‌నే ఉద్దేశంతో  కొత్త ఎత్తులో భాగంగా.. నాని టార్గెట్‌గా ట్వీట్లు. సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక మొన్న‌యితే.. ఏకంగా వీడియో రికార్డింగ్ చేసి మ‌రీ త‌న మాట‌ల‌దాడిని రిలీజ్ చేసింది. నాని.. నువ్వేంటో .. నీకు న‌చ్చిన స్ట‌యిల్ ఏమిటో మీ ఆవిడ‌కు   చెప్ప‌వా అంటూ హాట్‌గా.. సారీ.. చాలా ప‌చ్చిగా మాట్లాడింది. అయితే.. నానీ లైట్‌గా తీసుకుని వుంటే ఇంత‌వ‌ర‌కూ వ‌చ్చేది కాదేమో.. కానీ.. నాని లీగ‌ల్‌నోటీసు పంప‌టంతో.. పిచ్చ‌మ్మ‌కు మ‌రింత చెల‌రేగింద‌నే  అభిప్రాయం కూడా సినీ ప్రముఖుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి. శ్రీరెడ్డిని హైలెట్ చేసేందుకు ఇప్ప‌టికీ అవ‌కాశం ఉంది.

 

కానీ.. మీడియా మాత్రం ఇదంతా రాజ‌కీయంగా ముడిప‌డి ఉంద‌నే ఉద్దేశంతో ఆచితూచి స్పందిస్తున్నాయి. పైగా.. ఈ మ‌ధ్య‌నే.. ప‌వ‌న్ మంత్రి లోకేష్‌ను విమ‌ర్శిస్తే.. చూస్తూ ఊరుకోనంటూ లోకేష్ త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకుని మ‌రీ మాట్లాడింది. మ‌రి.. ఇదంతా.. ఎందుకు.. దీని వెనుక అంత‌రార్ధం ఏమిట‌నేది కాల‌మే తేల్చాల్సింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.