శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన నాని

సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది.. ఈ మాట అన్నది ఎవరో కాదు నేచురల్‌ స్టార్‌ నాని. ఎల్లప్పుడూ కూల్‌గా కనిపించే నాని ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు చేస్తూ.. తన సహనాన్ని పరీక్షిస్తున్న నటి శ్రీరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తన పరువుగు భంగం కలిగిస్తున్న శ్రీరెడ్డికి నాని లీగల్‌ నోటీసులు పంపించాడు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో నానిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆయన పరువుకు భంగం కలిగిస్తోందంటూ నాని తరపు న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చామని, ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు హాజరై ఆమె చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాని తరఫు న్యాయవాదులు సూచించారు.

 

తనపై వస్తున్న ఆరోపణలపై నాని ట్విట్టర్‌లో స్పందించాడు. ‘‘ప్రతి చిన్న విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఆరోపణలు చేసిన వాళ్లు అడిగే ప్రతి అంశంపై బదులివ్వడం నాకు ఇష్టం లేదు. లీగల్‌ ప్రొసీజర్‌ మొదలు పెట్టాం. పరువు నష్టం కింద నోటీసులు పంపించా. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నా సమయాన్ని వృథా చేయవద్దు. నేను నాగురించి బాధ పడడం లేదు. సమాజం గురించి బాధ పడుతున్నా. నాపై వచ్చిన నిరాధార ఆరోపణలను కొద్దిపాటి క్లిక్‌ల కోసం కొందరు నిస్సిగ్గుగా ప్రచురిస్తున్నారు. సిగ్గులేకుండా క్లిక్‌ల కోసం ఇలాంటి నిరాధార వార్తలు ప్రచురించే వారికి కూడా కుటుంబాలుంటాయి కదా.. ఇలాంటి తప్పుడు ఆరోపణలను, వార్తలను వ్యాప్తి చేయకపోవడం మంచిది. నేను దీనిపై మరోసారి కామెంట్‌ చేయదలుచుకోలేదు.’’ అంటూ నాని చేసిన ట్వీట్ వైరల్‌ అవుతోంది. నానికి మద్దతుగా నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

 

‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతి త్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్‌ చేయడం టాలీవుడ్‌లో దూమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా నాని ట్వీట్‌పై కూడా శ్రీరెడ్డి స్పందించింది. ‘తప్పకుండా.. మనం లీగల్‌గానే ఫైట్ చేద్దాం’ అంటూ నాని ట్వీట్‌ను రీట్వీట్ చేసింది శ్రీరెడ్డి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.