నంద‌మూరి వ‌ర్సెస్ మెగా !!

రాజ‌కీయం.. సినిమా ఏదైనా బ‌రిలో ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా ఉన్న‌పుడే అందం. ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ ఉన్న‌పుడు పండుతుంది. ఇప్పుడు రాజ‌కీయాల్లో మెగాఫ్యామిలీ వ‌ర్సెస్ నందమూరి అన్న‌ట్లుగానే సాగుతున్నాయి. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం అంటూ నిన‌దిస్తే.. మార్గం ఏదైనా.. అదే మార్గంలో జ‌న‌సేన అడుగులు వేస్తోంది. ఇద్ద‌రి పంధా ఒక్క‌టి కావ‌టం వ‌ల్ల‌నే 2014లో ఇరుపార్టీ ల మ‌ధ్య సారుప్య‌త కుదిరింది. కానీ.. మ‌ధ్య‌లో త‌లెత్తిన వివాదాలు.. ప్ర‌జాప్ర‌తినిధుల తొంద‌ర‌పాటు కామెంట్స్‌తో బంధం దాదాపు విడిపోయేంత వ‌ర‌కూ చేరింది. ఇప్పుడున్న ప‌రిస్థితేలు రేప‌టి ఎన్నిక‌ల వ‌ర‌కూ కొన‌సాగుతాయ‌నే గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు విడిగా వున్న క‌లిసేందుకు అవ‌కాశాలున్నాయంటూ టీడీపీ పార్టీ నేత‌లు ఒక‌రిద్ద‌రు త‌మ అనుచ‌రుల‌తో స‌ర‌దా క‌బుర్ల‌లో చెప్పేస్తున్నార‌ట‌. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో చంద్ర‌బాబు, లోకేష్ బాబుపై చేసిన కామెంట్స్‌కు బాల‌య్య ఘాటుగానే బ‌దులిచ్చాడు. నేను స్పందించి ఎవ‌ర్నీ హీరోల‌ను చేయ‌ద‌ల‌చుకోలేదంటూ ఎద్దేవాచేశారు. జూనియ‌ర్ కూడా అంత‌రంగికుల వ‌ద్ద త‌ప్ప‌ని ప‌వ‌న్‌ను వ్య‌తిరేకించినా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడ‌లేనంటూ చెప్పుకోచ్చార‌ట‌. హ‌రికృష్ణ త‌న‌యుడు క‌ళ్యాణ్‌రామ్‌ను ఉద్దేశించి నిర్మాత‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన పార్టీ మీద‌ని.. అక్క‌డ ఎమ్మెల్యేగా ఉండాల్సింది నీవేనంటూ.. క‌ళ్యాణ్‌రామ్‌ను కాస్త ముందుకు తోసిన‌ట్లుగా మాట్లాడాడు. ఇక‌పోతే.. సినిమాల విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో ఖైదీనెంబ‌రు 150 అండ్ గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి మ‌ధ్య పోటీ మ‌జానిచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా క‌ళ్యాణ్‌రామ్‌, రంగ‌స్థ‌ల న‌టుడిగా రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ ఒకేసారి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. అక్క‌డ సీనియ‌ర్లు.. రాజ‌కీయ వేదిక‌పై విమ‌ర్శ‌లు గుప్పించుకుంటుంటే.. ఇక్క‌డ వెండితెర‌పై జూనియ‌ర్లు పోటీ ప‌డ‌బోతున్నార‌న్న‌మాట‌.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.