అబ్బాయిల‌కు బాబాయి బాస‌ట‌!

మేమంతా.. ఒక‌టి.. మా కుటుంబంలో వంద ఉండ‌వ‌చ్చు. కానీ.. క‌ష్టం వ‌చ్చిన‌పుడు మేమంతా క‌లిసే ఉంటామంటూ చాటారు బాల‌య్య. హ‌రికృష్ణ మ‌ర‌ణంతో అభ‌ద్ర‌తా భావంలో ప‌డిపోయిన అన్న కొడుకుల‌కు.. కుటుంబ స‌భ్యుల‌కు.. తాను ఉన్నానంటూ భ‌రోసానిచ్చారు. శుక్ర‌వారం జ‌రిగిన చిన‌క‌ర్మ కార్య‌క్ర‌మంలో బాల‌య్యే అన్నీ తానై జ‌రిపించాడు. పైగా.. జూనియ‌ర్‌, క‌ళ్యాణ్‌రామ్‌ల భుజంత‌ట్టి ధైర్యంగా ఉండ‌మంటూ హితబోధ కూడా చేశారు. మొన్న చంద్ర‌బాబు స్వ‌యంగా తానే హ‌రికృష్ణ పాడెమోసి.. కుటుంబానికి తాను ఉన్నానంటూ చెప్ప‌క‌నే చెప్పారు. ఇదే విష‌యాన్ని విప‌క్షాలు.. ప్ర‌త్య‌ర్థులు.. చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోస‌మే ఇదంతా చేశాడ‌ని అనుకున్నా.. త‌న క‌ర్త‌వ్యం.. బావ‌గా నా బాధ్య‌త నిర్వ‌ర్తించానంటూ చెప్పార‌ట‌. నిజ‌మే.. కుటుబంలో ఎన్ని క‌ల‌త‌లున్నా.. ఏదైనా అవ‌స‌ర‌మైన‌పుడు అంద‌రూ క‌ల‌వ‌టం అన్ని కుటుంబాల్లోనూ స‌హ‌జ‌మే. గాక‌పోతే.. రాజ‌కీయ, సీని వార‌స‌త్వం ఉన్న నంద‌మూరి కుటుంబంలో 1982 నుంచే వివాదాలున్నాయి. అది ఎన్‌టీఆర్ మ‌ర‌ణంతో తారాస్థాయికి చేరాయి. 2014లో చంద్ర‌బాబు ప‌వ‌ర్ కోసమో.. బాల‌య్య‌, జూనియ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌ల ప్ర‌భావ‌మో.. ఇద్దరికీ మాట‌లు దూర‌మయ్యాయి. అంత‌మాత్రాన‌.. మేం శ‌త్రువులం కాదంటూ.. ప‌లు సందర్భాల్లో జూనియ‌ర్ చెబుతూనే ఉన్నారు. అవ‌స‌ర‌మైన వేళ టీడీపీ త‌ర‌పున నిల‌బ‌డ‌తానంటూ కూడా చెప్పారు.
కానీ.. బాలయ్య‌, ఎన్‌టీఆర్ సినిమాల రిలీజ్ స‌మ‌యంలో మాత్రం.. ఇద్దరి ఫ్యాన్స్ మ‌ధ్య అంత‌ర్గ‌త యుద్ధం. సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు సాగేవి. ఇప్పుడు.. హ‌రికృష్ణ మ‌ర‌ణంతో అవ‌న్నీ మ‌ర‌చిపోయిన అంద‌రూ ఒక్క‌చోటికి చేరారు. అన్న కొడుకులంటే.. అభిమానం ఉందికాబ‌ట్టే లెజెండ్ అహంవ‌దిలేసి వెళ్లాడంటున్నారు ఫ్యాన్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరువురి విడిపోతే ల‌బ్దిపొందాల‌ని భావించిన వారికి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్ట‌యింది. కౌర‌వులు, పాండ‌వుల మ‌ధ్య వైరం వున్నా.. మూడో వ్య‌క్తి వ‌స్తే.. మేం 105 మందిమంటూ ఆ నాడు ధ‌ర్మ‌రాజు చెప్పిన‌మాట‌ను ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.