ఓర్నీ.. న‌ల్ల‌గొండ రాజ‌కీయం స‌ల్ల‌గుండ‌!

తెలుగునేల‌పై సీమ రాజ‌కీయాలు.. గుంటూరు రాజ‌కీయాల స్ట‌యిలే వేరు. ఏత‌లు…. తీసివేత‌లు అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణం. వ‌ర్గంలో ప‌ట్టునిలుపుకునేందుకు. ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించేందుకు ఎంతవ‌ర‌కైనా వెళ‌తారు. తాడిప‌త్రిలో జేసీ వ‌ర్సెస్ సాములోరు ర‌చ్చ అలాంటిదే. అక్క‌డ అవ‌న్నీ కామనే. మ‌రి తెలంగాణ‌లో ఎప్పుడో ఒక‌టి.. అదీ ఎన్నిక‌ల వేళ త‌ప్ప‌ద‌న్న‌ట్టుగా రాజ‌కీయ వ్యూహాలు.. ఎత్తుకు పై ఎత్తుల‌తో ప్ర‌ణాళిక ర‌చ‌న సాగుతుంటుంది. కానీ న‌ల్ల‌గొండ జిల్లా రాజ‌కీయం మాత్రం నిత్యం రావ‌ణ‌కాష్ట‌మే. న‌క్స‌లిజం నుంచి ఉగ్ర‌వాదం వ‌ర‌కూ ప‌రువు హ‌త్య‌ల నుంచి పాప‌పు ప‌నుల వ‌ర‌కూ ఆ జిల్లా పేరు వింటేనే హ‌డ‌లెత్తిస్తుంది. మొన్నీ మ‌ధ్య‌నే న‌ల్గొండ పుర‌పాల‌క ఛైర్ ప‌ర్స‌న్ భ‌ర్త‌ను దారుణంగా హ‌త‌మార్చారు. దీనివెనుక రాజ‌కీయ కుట్ర‌దాగుందంటూ హ‌స్తం నేత‌లు పొర్లుదండాలు పెట్టి మ‌రీ విన్న‌వించినా తూచ్ అంటూ అధికార వ‌ర్గం కొట్టిపారేసింది. ఇప్పుడు అదే జిల్లా మిర్యాల‌గూడ‌లో ప్రేమ‌జంట వివాహం మ‌రోసారి తెర‌మీద‌కు తెచ్చింది. అమృత‌, ప్ర‌ణ‌య్‌ల కులాలు వేరుకావ‌టంతో పెళ్లిని త‌ట్టుకోలేని తండ్రి మారుతీరావు ప్ర‌ణ‌య్‌ను దారుణంగా హ‌త్యచేయించాడు. ఏకంగా కోటిరూపాయ‌ల సుపారీ ఇప్పించాడు. అయితే.. స‌ద‌రు మారుతీరావు అధికార టీఆర్ ఎస్‌తో క‌ల‌సి సాగించిన దారుణాల‌ను భూక‌బ్జాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ముంద‌స్తు ఎన్నిక‌లు త‌రుముకురావ‌టంతో  రాజ‌కీయంగా కూడా వేడెక్కింది.
ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకుంటూ కోమ‌టిరెడ్డి అండ్ సంప‌త్ వంటి హ‌స్తం ఎమ్మెల్యేలు నిర‌స‌న తెలిపారు. చేతిలో మైక్‌ను ఏకంగా మండ‌లి ఛైర్మ‌న్‌పై  విసిరారు. పాపం.. అది కంటికి త‌గ‌ల‌డంతో ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి గాయ‌మైంది. దీంతో హ‌స్తం ఎమ్మెల్యేల‌ను స‌భ నుంచి బ‌హ‌ష్క‌రించ‌ట‌మే కాదు. ఏకంగా భ‌ర్త‌ర‌ఫ్ చేశారు. ఎన్నిక‌ల సంఘానికి ఎన్నిక‌లు జ‌ర‌పాలంటూ విన్న‌పం చేశారు. అయితే వ్య‌వ‌హారం కోర్టు వ‌ర‌కూ చేర‌టంతో ప్ర‌స్తుతానికి స్త‌బ్ద‌త నెల‌కొంది. మైలేజ్ వ‌స్తుంద‌నుకున్న ఘ‌ట‌న కాస్త‌. వెంక‌ట‌రెడ్డి, సంప‌త్‌ల‌ను అటుఇటూ గాకుండా చేసింది. గులాబీ పార్టీ న‌ల్గొండ‌పై ప‌ట్టు సాధించేందుకు ఇవ‌న్నీ చేస్తుంద‌నే ఆరోప‌ణ‌లూ లేక‌పోలేదు తాజాగా మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి వ‌ర్సెస్ జానారెడ్డి వ‌ర్సెస్ సంప‌త్ ఇలా.. చాలా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇటువంటి వేళ మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి హ‌త్య‌కు రెక్కీ చేశార‌నే విష‌యం క‌ల‌క‌లం రేకెత్తిస్తుంది. న‌క్స‌లైట్లు, ఉగ్ర‌వాదులు, సుపారీ గ్యాంగుల‌కు ఆన‌వాల‌మైన న‌ల్గొండ జిల్లాలో అంతర్గ‌త గొడ‌వ‌లు.. ఇంత‌గా చేరితే దాన్ని అడ్డుకోవ‌టం క‌ష్ట‌మ‌నే ఆందోళ‌న కూడా నెల‌కొంది. ప్ర‌స్తుతం రాజ‌కీయ క‌క్ష‌లు.. విజ‌యం కోసం ప‌రిత‌పిస్తున్న నేత‌ల‌తో మున్ముందు ఆ జిల్లా ఇంకెంత వేడెక్కుతుంద‌నేది చూడాల్సిందే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.