ఎన్టీఆర్ బయోపిక్‌లో ‘‘వెన్నుపోటు ఎపిసోడ్’’

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘ఎన్టీఆర్’’. ఆయన కుమారుడు, నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.. కొన్ని కీలక పాత్రల్లో రానా దగ్గుబాటి, మోహన్ బాబు, సుమంత్ తదితరులు నటిస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్యభౌముని పాత్రను తెరపై చూడనుండడం, అది కూడా ఆయన కుమారుడు ఆ పాత్రను చేస్తుండడం, ఎన్నికల ఏడాదిలో రాబోతుండండం వంటి కారణాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి బయటికొచ్చిన వార్త రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలకమైన ‘‘వెన్నుపోటు ఎపిసోడ్’’ను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్ ముఖ్యమైనది. ఎన్టీఆర్ పార్టీ పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 1984లో ఎన్టీఆర్ బైపాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో.. గవర్నర్‌ను కలిసి రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. దొడ్డిదారిన గద్దెనెక్కడంతో రామారావు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. నెలరోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా, భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు.

ఇప్పుడు దీనినే ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో చూపించబోతున్నారని సమాచారం. ఇదే ఆ సినిమా క్లైమాక్స్‌గా ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అయితే, కొద్దిరోజుల కిందట ఎన్టీఆర్ బయోపిక్‌లో తన తండ్రిని నెగెటివ్‌గా చూపిస్తారన్న సమాచారం తమకు వచ్చిందని ఆయన కుమారుడు క్రిష్, బాల‌కృష్ణ‌కు నోటీసులు పంపారు. ఎమ్మెల్యే, నటుడి హోదాలో బాలకృష్ణకు రెండు నోటీసులు పంపారు. ఈ సినిమాలో తన తండ్రి నాదెండ్ల భాస్కరరావు పాత్ర విషయమై తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ఆయనను నెగిటివ్ షేడ్‌లో చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, ఆయనపై ‘బయోపిక్’ తీసుకోవడంలో తప్పులేదు కానీ, తన తండ్రిని నెగెటివ్ గా చూపించాలనుకోవడం సరికాదని ఆ నోటీసుల్లో పేర్కొన్నార‌ని తెలిసింది. దీంతో ఇప్పుడు బయటికొచ్చిన ఈ వార్తతో ఆయన కుటుంబ సభ్యులు ఏం చేస్తారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.