నా పేరుసూర్య. నా ఇల్లు ఇండియా మూవీ రివ్యూ….

సినిమా పేరు : నా పేరుసూర్య. నా ఇల్లు ఇండియా
రేటింగ్ : 3/5
నటీనటులు : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్, అర్జున్ సర్జా, శరత్ కుమార్, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, బోమన్ ఇరానీ, పోసాని
దర్శకత్వం : వక్కంతం వంశీ 
నిర్మాతలు : లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు, నాగబాబు 
సంగీతం : విశాల్, శేఖర్
సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి, సుశీష్ చౌదరీ 
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు 
పరిచయ మాటలు….
అల్లువారి అబ్బాయి. స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్. సరైనోడు, దువ్వాడ జగన్నాథం మూవీల విజయంతో దూసుకుపోతున్నాడు. ఆ చిత్రాల తర్వాత వచ్చే సినిమా కావడంతో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా పై అంచనాలు పెరిగాయి. కథ, మాటల రచయిత వక్కంత వంశీ తొలిసారి దర్శకుడిగా మరాడు. ఆర్మీ నేపధ్యంలో తెరకెక్కింది సినిమా. అందుకే ఎన్నడూ లేనంతగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సూపర్ హిట్లు వచ్చాయి. అందుకే నా పేరు సూర్యకు అదే టాక్ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే టీజర్లు, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగింది. కాబట్టి ఈ సినిమా విజయం సాధించిందా…లేదా అనేది చూద్దాం…
కథలోకి వెళితే…
సూర్య (అల్లు అర్జున్) ఒక సైనికుడు. తప్పు చేస్తే ఊరుకునే స్వభావం కాదు. వెంటనే కోపం వస్తోంది. వారి అంతు చూసే వరకు వదలడు. అదే ప్లస్..అదే మైనస్ అయ్యాయి. దేశ సరిహద్దులో విధులు నిర్వహించాలనేది ఆయన ఆశయం. చివరకు అనుకుంది సాధిస్తాడు. ఒక కారణంతో భారత సైన్యం నుంచి సూర్యను కల్నల్ (బోమన్ ఇరానీ) బయటకు పంపుతాడు. సూర్య చాలా మంచివాడని అతనికి మరో అవకాశం ఇవ్వాలని కల్నల్ గాడ్ ఫాదర్ (రావు రమేష్) కోరతాడు. ఆయన చెప్పారనే కారణంతో సూర్యకు మరో చాన్స్ ఇస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు. విశాఖపట్నంలో ఉన్న సైకాలజిస్టు డాక్టర్ రామక‌ృష్ణంరాజు (అర్జున్) సంతకం తీసుకురమ్మనేది తిరకాసు. అప్పుడు తిరిగి అతన్ని సైన్యం చేర్చుకుంటానని మాట ఇస్తాడు. అదే సమయంలో కోపం తగ్గించుకునేందుకు మూడు వారాల గడువు ఇస్తాడు. 
రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య 21 రోజుల్లో అతని సంతకం తీసుకొన్నాడా? సూర్య జీవితంలో తన ప్రేయసి వర్ష (అను ఇమ్మాన్యుయేల్) పోషించిన పాత్ర ఏమిటి? సూర్య, జ్యోతి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి. కారణం ఏంటి…తన కోపాన్ని సూర్య తగ్గించుకున్నాడా? రామకృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి…రామకృష్ణంరాజుకు సూర్య ఎందుకు దూరమయ్యాడు? రావు రమేష్ ఎందుకు గాడ్‌ఫాదర్‌గా మారాడు? ఆ 21 రోజుల్లో సూర్య ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
విశ్లేషణ…
సినిమా తొలి భాగం ఎక్కువగా సూర్య చుట్టూరా తిరుగుతోంది. వీలున్నంత వరకు సూర్య పాత్రను మలిచేందుకు ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. కొపిష్టి అయిన సూర్య దేశం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే తీరు ఆకట్టుకుంది. ఇక ఫైట్స్, ఎమోషన్ సీన్లు చాలా బాగా కుదిరాయి. తండ్రి రాఘురామకృష్టంరాజు, సూర్య మధ్య సాగే సన్నివేశాలు భావోద్వేగం కలిగిస్తాయి. ఫస్టాప్ చివర్లో వచ్చే సీన్స్ అదిరిపోతాయి. కథను నడిపిన తీరు చాలా నెమ్మదిగా ఉంది. కొన్ని సార్లు విసుగుపుట్టిస్తోంది. సూర్య తన కోపాన్ని తగ్గించుకునే అంశాలను బాగానే చిత్రీకరించారు. కోపం అనే ఒక పాయింట్‌ను సాగదీసి సిినిమా అంతా చూపించడమే ఆశ్చర్యం. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా శుభం కార్డు వరకు వచ్చే చాలా సీన్లకు అల్లు అర్జున్ పాత్రే ప్రాణం. అతను లేకపోతే ఈ సినిమా లేదు. అల్లు అర్జున్ సైనికుడిగా బాగా ఒదిగిపోయాడు. స్టైల్ అదిరింది. ఇప్పటి యువతరం అల్లు అర్జున్ స్టైల్లో కనపడినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. కథ మొత్తాన్ని సూర్య పాత్ర మోస్తోంది. ఆ పనిని అల్లు అర్జున్ బాగా చేసాడు. 
దర్శకత్వ ప్రతిభ
దర్శకుడు వక్కంతం వంశీ దర్శకుడిగా మారాడు కాబట్టి అతని ఆలోచనలను అమలు చేసే పని చేశాడు. కాకపోతే కథను రాయం వేరు. దర్శకుడిగా మారడం వేరు. ఆ వేరేయేషన్స్ లో తేడా కనపడింది. మరింతగా కసరత్తు చేస్తే బాగుండేది అనిపిస్తోంది. రైటర్ దర్శకుడిగా మారితే మంచిది. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ వంటి చాలా మంది అలా చేసిన వారే. కాకపోతే వక్కంత వంశీ ఆలోచన వేరు. వాస్తవం వేరు. అల్లు అర్జున్‌తో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోక పోతే వ్యతిరేక కామెంట్లు వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అల్లు అర్జున్‌ను కొత్త కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కథను చాలా నెమ్మదిగా నడిపించిన తీరు అప్పుడప్పుడు బోరుకొట్టిస్తోంది. 
అల్లు అర్జున్ ఫైట్లు, పాటలతో అలరించాడు. బాగా స్టైయిల్ గా కనపడ్డాడు. తాను కమర్షియల్ సినిమాలకే కాదు..భావోద్వేగ పరమైన కథలకు పనికొస్తానని చెప్పకనే చెప్పాడు. ఎమోషన్స్ , ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అల్లు అర్జున్ నటనను ఎక్కడకో తీసుకెళ్లాయి. ఇక అందాల భామ అను ఇమ్మాన్యుయేల్‌ అంతగా ఆకట్టుకునేలా లేదు. అనుకి ఇది అంత పేరు తెచ్చే పాత్ర కాదని చెప్పవచ్చు. ఏదో అలా ఆట, పాటలకే పరిమితం. కానీ  కొన్ని సన్నివేశాల్లో తనదైన నటనను చూపించింది. అందంతో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ మూవీలో గ్లామరస్ పాత్రకే పరిమితమైంది. ఇక మిగతా పాత్రల్లో అర్జున్ భార్యగా నదియా కుదిరింది. ఇక విలన్ పాత్రల్లో శరత్ కుమార్, ప్రదీప్ రావత్, అనూప్‌ థాకూర్‌ సింగ్‌ పర్వాలేదు.  విలన్‌గా శరత్ కుమార్ సత్తా చాటాడు. బోమన్ ఇరానీ, రావు రమేష్, పోసాని కృష్ణమురళీ తదితరుల పాత్రలు సినిమాకు మరింత హంగును తీసుకువచ్చాయి. విశాల్, శేఖర్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. 
తొలి, చివరి పాటలు ఆకట్టుకున్నాయి కానీ అనుకుంత మేర అవి లేవు. రాజీవ్ రవి, సుశీల్ చౌదరీ అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి బాగానే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కెమెరా పనితీరు అద్భుతం. యాక్షన్ సీన్లు చాలాబాగా వచ్చాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ లో లోపాలున్నాయి. లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు, నాగబాబు వంటి నిర్మాతలు ఖర్చుకు రాజీపడకుండా ముందుకు వెళ్లారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్లు. 
సరిహద్దులో ఉండే శత్రువుల కంటే దేశంలో ఉండే దుష్టశక్తులే ప్రమాదకరం అనే పాయింట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వక్కంత వంశీకి ఈ మూవీ అనుకోని వరమనే చెప్పాలి. కథకు అనుగుణంగా ఆకట్టుకొనే డైలాగ్స్‌ను రాసుకున్నాడు. కానీ కొన్ని సన్నివేశాలు తేలిపోయేలా ఉన్నాయి. ‘‘నీకు సూర్య అంటే సోల్జర్. కానీ, ప్రపంచానికి సూర్య అంటే యాంగర్’’ అనే డైలాగ్‌ బాగుంది. అదే కాదు కొన్ని డైలాగ్స్ ఏమోషన్ సీన్స్ తో అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమాకు మంచి గుర్తింపు ఉంటోంది. సైన్యం కోసం సినిమా చూడవచ్చు.  
ప్లస్ పాయింట్లు…
+ అల్లు అర్జున్ నటన
+ శరత్ కుమార్ విలనిజం
+ కెమెరా పనితనం
మైనస్ పాయింట్లు…
– నెమ్మదిగా సాగిన సినిమా
– స్క్రీన్ ప్లే
– సంగీతం 
– ఎడిటింగ్