తెలుగు వారి మ‌దిదోచిన న‌మ‌స్తే ఆంధ్ర‌… సీఎం చంద్ర‌బాబు

విదేశాల్లో ఉన్న ఎన్నారైల‌కు ఫేవ‌రెట్ వెబ్‌సైట్‌గా నిలిచిన `న‌మ‌స్తే ఆంధ్ర` వెబ్‌సైట్ మ‌రో ముంద‌డుగు వేసింది. ఏడేళ్ల నుంచి దిగ్విజ‌యంగా నిర్విరామంగా తెలుగు వారికి అత్యుత్త‌మ రాజ‌కీయ విశ్లేష‌ణ‌ల‌ను అందిస్తున్న *న‌మ‌స్తే ఆంధ్ర* ప‌త్రిక తెలుగుదేశం మ‌హానాడు సంద‌ర్భంగా ప్ర‌త్యేక సంచిక‌ను వెలువ‌రించింది.
ఈ ప్ర‌త్యేక సంచిక‌ను తెలుగువారి స‌త్తాను చాటిచెప్పే కార్య‌క్ర‌మం అయిన తెలుగుదేశం పార్టీ మ‌హానాడు సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ ర‌థ‌సార‌థి, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆవిష్కరించారు. ఏపీ ఏపీఎన్ఆర్‌టీ అధ్య‌క్షుడు డాక్టర్ ర‌వి వేమూరు, చీఫ్ కో ఆర్డినేట‌ర్ బుచ్చి రాం ప్ర‌సాద్‌, ఏపీఎన్ఆర్‌టీ స్మార్ట్ విలేజెస్‌ డైరెక్టర్ డాక్ట‌ర్ నిరంజ‌న్ మోటూరి, ఏపీఎన్ఆర్‌టీ డైరెక్ట‌ర్ డాక్టర్  ముర‌ళీ న‌న్న‌ప‌నేని త‌దిత‌రులు ముఖ్య‌మంత్రితో పాటు ఈ సంచిక‌ను ఆవిష్క‌రించారు.
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న మ‌హానాడులో జ‌రిగిన న‌మ‌స్తే ఆంధ్ర ప‌త్రిక ప్ర‌త్యేక సంచికను ఆవిష్క‌రించిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌త్రిక యాజ‌మాన్యానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌మ‌స్తే ఆంధ్ర ఖ్యాతి విశ్వ‌వ్యాప్తం కావాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ జ‌ర్న‌లిజం దూసుకువెళుతోంద‌ని పేర్కొంటూ ఇటు డిజిట‌ల్ జ‌ర్న‌లిజం వెబ్‌సైట్ ద్వారా, అటు సంప్ర‌దాయ జ‌ర్న‌లిజంలో ప‌త్రిక ద్వారా న‌మ‌స్తే ఆంధ్ర ముందుకు సాగి తెలుగువారి ఘ‌న‌త‌ను చాటాల‌ని సీఎం చంద్ర‌బాబు అభిల‌షించారు. ఏడేళ్లుగా న‌మ‌స్తే ఆంధ్ర ఎన్నారైల మ‌న‌సు దోచుకుంద‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా `న‌మ‌స్తే ఆంధ్ర`కు కితాబు ఇవ్వ‌డం విశేషం. 
న‌మ‌స్తే ఆంధ్ర.. అమెరికాలో అత్య‌ధికులు ఆద‌రించే తెలుగు టాబ్లాయిడ్‌. చాలా సాధార‌ణంగా ప్రారంభ‌మై చ‌క్క‌టి విశ్లేష‌ణ‌ల‌తో తెలుగు వారి మ‌న‌సుల్లో నాటుకుపోయింది. ఆన్‌లైన్ జ‌ర్న‌లిజం వేగంగా విస్త‌రిస్తున్న రోజుల్లోనూ ఈ ప‌త్రిక‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ వ‌స్తోందంటే ఆ ప‌త్రిక అందించే ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌లు, క్వాలిటీ ముద్ర‌ణ‌, అనేక ప్ర‌త్యేక శీర్షిక‌లు కార‌ణం. ఈ ప‌త్రిక నిర్వ‌హ‌కులు, దీనిపై మాట్లాడుతూ ఏడేళ్లుగా పాఠ‌కులు ఏది కోరుకుంటారో అది ఇవ్వ‌డ‌మే మా బాధ్య‌త‌గా ముందుకు వెళ్తున్నాం అని వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు, ఏపీఎన్నార్టీ అధ్య‌క్షుడు డాక్టర్  ర‌వి వేమూరి స్వ‌యంగా ఈ ప‌త్రిక‌ను ఆవిష్క‌రించ‌డం ప‌త్రిక‌కు ద‌క్కిన గౌర‌వంగా భావించి మ‌రింత బాధ్య‌త‌తో ముందుకు వెళ్తామ‌ని చెప్పారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.