ముద్రగడ పవన్‌కు అన్యాయం చేస్తారా?

ఇప్పటికే కాపుల పార్టీగా జనసేన పేరుపడినట్టు తెలుస్తోంది. ఇంతవరకూ జనసేన కార్యకలాపాలు గోదావరి జిల్లాల్లోనే ముమ్మరంగా సాగాయి. అక్కడ కాపులు జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేన ప్రభావం కూడా అక్కడే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగా గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు జనసేన వైపు మరలుతున్నారు. అయితే పదవుల్లో ఉన్న వాళ్లు, మళ్లీ పదవి దక్కుతుందనే విశ్వాసం ఉన్న వాళ్లు జనసేన వైపు వెళ్లడం లేదని తెలుస్తోంది. పదవి లేని వాళ్లు.. టీడీపీ, వైకాపాల్లో తమకు ఛాన్స్ దక్కదనే స్పష్టత కలిగిన వాళ్లు మాత్రమే జనసేన వైపు చూస్తున్నారని సమాచారం. ఇలాంటి వాళ్లంతా కాపు సామాజికవర్గం వాళ్లే కావడంతో జనసేన పూర్తిగా కాపుల పార్టీ అనే ముద్రను వేయించుకుంటోందని సమాచారం. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కులాలకు అతీతంగా చాలా మంది ఆ పార్టీలో చేరారనే విషయం తెలిసిందే. అయినప్పటికీ చిరు పార్టీమీద కాపుముద్ర పడింది.
దీంతో అపవాదులను ఎదుర్కొంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీ మరీ కాపులకే పరిమితం అయిపోతున్నట్లున్నదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కూడా టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కాపు రేజర్వేషన్లపై చేతులు ఎత్తేయడంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆయన మీద విరుచుకుపడిన విషయం విదితమే. ఆ తరువాత జగన్ యూ టర్న్ తీసుకున్న దానిని జనం నమ్మే పరిస్థితి లో లేరనే వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు కాపు కులానికి చెందిన వాడైన పవన్ కళ్యాణ్ రేజర్వేషన్ల పై స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వద్దన బోమని చెబుతూనే, కులం పరంగా తాను ఏ నిర్ణయం తీసుకోనని తేల్చిచెప్పడం విశేషం. ఈ అంశంలో టీడీపీ మాత్రమే కాస్త స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముద్రగడ టీడీపీకి మద్దతు పలికే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.