అండగా ఉంటాడనుకున్న వ్యక్తి కూడా జగన్‌కు హ్యాండిచ్చాడా..?

పాపం జగన్.. ఈ మధ్య ఏమన్నా.. ఏం చేసినా.. తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావాలని కలలు కంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతకు కాలం కలిసి వచ్చేలా కనిపించడంలేదు. ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా అవి అనుకూలంగా మారకపోగా, ప్రతిబంధకంలా మారిపోతున్నాయి. దీంతో జగన్‌కు ఏం చేయాలో దిక్కుతోచడంలేదని టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లోనే జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాడట. కాపు రిజర్వేషన్లపై తన నిర్ణయాన్ని స్పష్టం చేయడం కూడా అందులో భాగమేననే టాక్ వినిపిస్తోంది. అసలు తన ప్రజాసంకల్పయాత్ర రూట్ మ్యాప్‌లో లేని జగ్గంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్న జగన్.. అక్కడి వెళ్లడం.. భారీ బహిరంగ సభ పెట్టి కాపు రిజర్వేషన్లు నావల్ల కాదని ప్రకటించడం జరిగిపోయాయి. ఈ పరిణామంతో ఏపీలో మెజారిటీగా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి జగన్‌ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ కారణంగానే ఎప్పటి నుంచో జగన్‌కు అండగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఆయనకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాపు రిజర్వేషన్ల గురించి మొదటి నుంచీ పోరాటం చేస్తున్న ముద్రగడ.. జగన్ తాజా ప్రకటనపై విమర్శల వర్ష కురిపించాడు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు.. తమ జాతి ఓట్లు అడగొద్దని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ముద్రగడ స్పష్టం చేశాడు. రిజర్వేషన్లకు అనుకూలంగా 2016 ఫిబ్రవరి ఒకటిన మాట్లాడిన జగన్‌ ఇప్పుడు యూ టర్న్‌ తీసుకొన్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.‌ అంతేకాదు జగన్‌కు కొన్ని ప్రశ్నలు సూటిగా సంధించారు. ‘కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధి కాదు కేంద్రం చేయాల్సింది అని జగన్‌ చెప్పడం బాధగా ఉంది. 2016 ఫిబ్రవరి ఒకటిన ప్రెస్‌మీట్‌లో జగన్‌ ఏం చెప్పారు? అసెంబ్లీలో ఏం మాట్లాడారో? గుర్తు చేసుకొండి. ఆనాడు అలా మాట్లాడి… ఈరోజు యూటర్న్‌ తీసుకొన్నారు. ఆరోజు సాధ్యం కాదన్న మాట అనలేదు. ఇప్పుడు కేంద్రం పరిధిలోకి తోసి తప్పించుకోవాలని చూస్తుంటే.. కాపులు నిత్యం అణగారిన జాతిలానే ఉండాలా? నిత్య ఇతరుల పల్లకీలు మోస్తూ.. వారి మోచేతి నీళ్లు తాగాలనేది మీ అభిప్రాయమా?’ అని ముద్రగడ ప్రశ్నించారు. అయితే ముద్రగడ అసహనానికి కూడా అర్థం ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్‌కు పరోక్షంగా మద్దతు పలికిన ముద్రగడ తాజా ప్రకటనతో తనపై వస్తున్న ఒత్తిడి పోగొట్టుకోడానికే జగన్‌కు హ్యాండివ్వాలని డిసైడ్ అయిపోయాడని బయట జోరుగా ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.