ముద్రగడతో మోత్కుపల్లి మంతనాలు ఎందుకంటే…

మహానాడు జరుగుతున్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుపై దారుణంగా విరుచుకుపడ్డారు తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఇప్పుడు ఆయన ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా యాత్ర చేస్తానని శపథం పూనాడు. అది మరింత ఆశ్చర్యం. టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని మోత్కుపల్లి గతంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమై మోత్కుపల్లి ఇలా మాట్లాడారనే ప్రచారం వచ్చింది. విషయం ఏదైనా చంద్రబాబు పై మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయింది టీడీపీ. కానీ ఆయన్ను పార్టీ నుంచి పక్కన పెట్టింది. ఫలితంగా మరోసారి తన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు మోత్కుపల్లి.

అదే మోత్కుపల్లితో ముద్రగడ పద్మనాభం ప్రత్యేకంగా మంతనాలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం… చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు టార్గెట్‌గా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు లేఖ జపం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఎంపికైన వెంటనే గుంటూరు కు వెళ్లి మంతనాలు జరిపారు. ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహులు.. చంద్రబాబుపై రివర్స్ అవగానే వెళ్లి కలవడం ఆశ్చర్యమే.

మోత్కుపల్లి నర్సింహులు ఏపీలో చేపడతానని చెప్పిన యాత్రకు ముద్రగడ పద్మనాభం మద్దతినిస్తారట. తమ సామాజికవర్గం అంతా.. మద్దతుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తానని హామినిచ్చారాయన. ఏపీలో .. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మోత్కుపల్లికి అంత తేలిక కాదు. అయినా సరే ముద్రగడ వచ్చారు కాబట్టి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించారట. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు.. ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబును వ్యతిరేకించి ఘాటుగా విమర్శలు చేసే మోత్కుపల్లి కలవడం హాట్ టాపికైంది. .

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు వారిద్దరు పదవుల్లో లేరు. పార్టీలు లేవు. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఇంకోవైపు తెలుగు తమ్మళ్లు. మోత్కుపల్లి యాత్రకు బీజేపీ నేతలు నిధులు ఇస్తారనే వాదన లేకపోలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.