‘మిస్టర్ మజ్ను’ మూవీ రివ్యూ

 సినిమా: మిస్టర్ మజ్ను
నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
నటీనటులు: అఖిల్ అక్కినేని, నిధి అగ‌ర్వాల్‌, జ‌య‌ ప్ర‌కాశ్‌, రావు ర‌మేష్‌, నాగబాబు, విద్యుల్లేఖారామ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ అది, సితార, పవిత్ర లోకేష్, అజ‌య్‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు
మ్యూజిక్: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: జార్జ్ సీ విలియ‌మ్స్‌
ఎడిటింగ్: న‌వీన్ నూలి
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ప్రొడ్యూసర్: బీవీఎస్ఎన్ ప్రసాద్
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: వెంకీ అట్లూరి

అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం హీరోగా తెరంగేట్రం చేశాడు అఖిల్. భారీ అంచనాలతో వచ్చిన మొదటి సినిమా ‘అఖిల్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దీంతో అక్కినేని కుటుంబానికి ‘మనం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన విక్రమ్ కుమార్‌తో రీ లాంచింగ్ చేయించారు. సొంత నిర్మాణ సంస్థలో నాగార్జున నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘హలో’ కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో వరుణ తేజ్‌కు ‘తొలిప్రేమ’ వంటి సక్సెస్‌ను అందించిన వెంకీ అట్లూరితో జతకట్టాడు ఈ అక్కినేని హీరో. ఇలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘మిస్టర్ మజ్ను’. పక్కా ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ మజ్ను అందుకున్నాడా..?

కథ
విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ(అఖిల్) విదేశాల్లో విద్యను అభ్యసిస్తుంటాడు. అందంగా ఉండడంతో విక్కీకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో అతని జీవితంలోకి ఎంతో మంది అమ్మాయిలు వచ్చి పోతుంటారు. అదే సమయంలో నిక్కీ(నిధి అగర్వాల్), విక్కీని చూస్తుంది. ఆమెకు మాత్రం శ్రీరాముడి లాంటి భర్త కావాలని ఉంటుంది. అందుకే విక్కీపై కోపం పెంచుకుంటుంది. కథ ఇలా సాగిపోతుండగా, వీరిద్దరూ ఇండియాకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఇద్దరూ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తారు. ఎయిర్‌పోర్టులో దిగగానే ఇద్దరికీ ఓ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత అనుకోని కారణాలతో ఈ ఇద్దరూ కలిసుండాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే నిక్కీ.. విక్కీ ప్రేమలో పడిపోతుంది. దీనికి మాత్రం విక్కీ ఒప్పుకోడు. అప్పుడు నిక్కీ ఏం చేసింది..? అసలు వీళ్లిద్దరికీ తెలిసిన నిజం ఏంటి..? ఇంతకీ నిక్కీ.. విక్కీ ఎందుకు కలిసున్నారు..? చివరికి వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్ర ‘మిస్టర్ మజ్ను’. పక్కా ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా కూడా అఖిల్‌తో పాటు సినీ ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. దర్శకుడు పాత కథనే తీసుకున్నా.. దాన్ని తెరకెక్కించడంలో చేసిన కొన్ని లోపాల వల్ల కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకెండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. దీనికితోడు కథనం బాగా నెమ్మదిగా ఉండడం కూడా సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ప్రేమ కథలోని బలమైన ఎమోషన్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మొత్తంగా ‘మిస్టర్ మజ్ను’ అంచనాలతో వెళ్లిన వారిని నిరాశ పరుస్తుంది. మామూలు సినిమా అనుకుని వెళ్తే మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

నటీనటుల పనితీరు
హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్.. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ముఖ్యంగా లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లు ఇలా అన్ని విభాగాల్లో తనదైన ఎఫర్ట్ పెట్టాడు. ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తూనే అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో అఖిల్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. నిధి అగర్వాల్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్‌తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. ఇక, కమెడియన్స్ హైపర్ ఆది, ప్రియదర్శి కూడా తమ కామెడీ టైమింగ్‌తో కొన్ని చోట్ల నవ్వించారు. అలాగే జయప్రకాశ్, సుబ్బరాజు, ఆజయ్, సితార సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
‘తొలిప్రేమ’తో ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాలో నిరాశపరిచాడు. పాత కథే అయినా మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ దానిని తెరకెక్కించే విధానంతో కొన్ని లోపాలు చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. అయితే, కొన్ని ఎమోషనల్ సీన్స్ సహా కామెడీ సన్నివేశాల్లో కూడా మంచి దర్శకత్వ పనితనం కనబరిచారు. ఇక సంగీత దర్శకుడు థమన్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సాంగ్, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

బలాలు
* అఖిల్, నిధి నటన
* కామెడీ సీన్స్
* ఫస్టాఫ్

బలహీనతలు
* కథ, కథనం
* సెకెండాఫ్
* ఎమోషనల్ సీన్స్

మొత్తంగా: ‘మిస్టర్ మజ్ను’ ఎమషన్ మిస్ అయింది

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.