మోత్కుపల్లి పై వేటు…

పార్టీ మారేందుకు సిద్దమైన మోత్కుపల్లి నోరు పారేసుకున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును తీవ్రంగా విమర్శించారు. ఎంతగా అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు అతని తీరు వెళ్లింది. ఎన్టీఆర్ 95వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ ఘాట్‌లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాట మీద నిలబడే రకం కాదన్నారు. అసలు చంద్రబాబుకు నైతిక విలువలు లేవన్నారు. రాజ్యసభ సీట్లను కోటీశ్వరులకు అమ్ముకున్నారని ఆరోపించారు. అంతే కాదు… టీడీపీని నందమూరి వారసులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఫలితంగా మోత్కుపల్లి అంశం మహానాడులో చర్చనీయాంశమైంది. తాడో పేడో తీల్చుకునేందుకు సిద్దమయ్యారనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు ఆయన పై వేటు వేశారు. 
మహానాడులో తనతో పాటే ఉన్న రమణను పిలిచి మాట్లాడారు. అతన్ని పక్కన పెట్టాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలో.. ప్యాకేజీ కావాలో నాలుగేళ్లుగా చంద్రబాబు తేల్చుకోలేక పోయారని మోత్కుపల్లి అన్నారు. అందుకే తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులును బహిష్కరించింది ఆ పార్టీ. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అధికారికంగా ప్రకటన చేశారు. టీడీపీని బలహీనపర్చే కుట్ర చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 
మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందని ఆశ పడ్డారు. కానీ అది లేకుండానే..కనీసం రాజ్యసభ సీటు దక్కకుండానే అతన్ని పక్కకు పంపినట్లు అయింది. తమిళనాడు గవర్నర్ పదవిని మోత్కుపల్లి కోరారు. చంద్రబాబు తన వంతుగా ప్రయత్నించారు. కానీ కేంద్రం గవర్నర్ పదవి ఇవ్వలేదు. అందుకే పార్టీ పై మోత్కుపల్లి ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను ఎన్టీఆర్‌తో పోల్చి చెప్పడం మోత్కుపల్లి వైఖరిని చెప్పకనే చెప్పింది. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన మోత్కుపల్లి కావాలనే ఇలాంటి ఆరోపణలు చేశారని అనుమానించింది టీడీపీ. అందుకే పక్కన పెట్టింది. ఇప్పటికే చాలా ఓపికగా చూశాం. ఇక చూస్తు ఊరుకునేదిలేదని హెచ్చరించింది టీడీపీ. పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు..పార్టీనే ముఖ్యమని చెప్పినట్లు అయింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.