చంద్రబాబును దారుణంగా తిట్టిన మోత్కుపల్లి

నిన్నటి వరకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇంద్రుడు. చంద్రుడు అన్నారు మోత్కుపల్లి నరసింహులు. ఆయన కోసమే పార్టీలో కొనసాగానని చెప్పారు. ఇప్పుడు అదే టీడీపీ, చంద్రబాబు పై ఇప్పుడు నోరు పారేసుకున్నారాయన. అందుకే పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. అంతే ఇక రెచ్చిపోయారు మోత్కుపల్లి. మరీ దారుణమైన బాష మాట్లాడారు. చంద్రబాబు ఒక నీచుడు, పిరికి పంద అని మాట్లాడారు. ఓటు నోటు కేసు భయంతోనే చంద్రబాబు విజయవాడకు పారిపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి కుట్రలు పన్ని కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని ఆరోపించారు. చివరకు అది విఫలం కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికన దొంగ చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. 
నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు మోడీ, అరుణ్ జైట్లి, కెసిఆర్ ల కాళ్ల మీద పడ్డాడని చెప్పారు. తెలంగాణలోపార్టీని సర్వనాశనం చేశారని మోత్కుపల్లి అంటున్నారు. కెసిఆర్ పేరుచెబితే చంద్రబాబు గజగజ లాడుతున్నారని చెప్పడం కాస్తంత ఆశ్చర్యమే. చంద్రబాబు ఒక నీచుడని, విలువలు లేని వ్యక్తి. తాను ఎప్పుడైనా పదవి అడిగానా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి లేడని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
చంద్రబాబు పై కోర్టుల్లో స్టే ఉన్న 29 కేసులను తెరిపించాలని కోరారు. సీబీఐ విచారణ చేస్తే అసలు బండారం బయటపడుతుందన్నారు. బాబు వేధింపుల వల్లే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయారని మరో సంచలన ఆరోపణ చేశారు. చంద్రబాబు నరహంతకుడని మాట్లాడారు. నిన్న నా గొంతు కోసేశారు. ఎన్టీఆర్‌ గొంతు కోసినట్టే ఆయన శిష్యుడినయిన నా గొంతు కూడా చంద్రబాబు కోసేశాడు. కనీసం ఉరితీసే ముందయినా చివరి కోరిక అడుగుతారు. ఆ అవకాశం కూడా నాకు చంద్రబాబు ఇవ్వలేదు’’అని మోత్కుపల్లి దారుణంగా మాట్లాడిన మాటలు హాట్ టాపికయ్యాయి. 
‘‘నువ్వు ఎన్టీఆర్‌పై కుట్ర చేసి గద్దె దింపావ్‌… నరహంతకుడివి నువ్వు. రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి ఈ దునియాలో లేడు. నీ జీవితమే కుట్రలకు, మోసాలకు నిలయం. ఎన్టీఆర్‌ మనుషులు 20 మంది నీ బాధకు చనిపోయారు. చంద్రబాబు వేధించడం వల్లే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు. నేనాయన్ని పదవి అడిగిన్నా.. ప్రమాణం చేయి. నా మాటలు బంద్‌ చేస్తా. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా. నిన్ను నేను ఏ పదవి అడిగిన? నీ దగ్గర నేను ఆశించింది ఏంటి? గవర్నర్‌ పదవి ఇవ్వమని నేనడిగానా? నువ్వేమైనా ప్రధానివా? రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి బంధువైన గరికపాటి మోహన్‌రావుకు అమ్ముకున్నవ్‌.
ఈ తిట్లు వింటే…
ఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర్‌ చెప్పారు. గవర్నర్‌ ఎలాగూ రాదు కాబట్టి ఆ పదవి ఇస్తానని చెప్పాడు. నేను లేకపోతే ఇంట్లోంచి బయటకు రాని పిరికిపందవు నువ్వు. పనికిమాలిన నాయకులతో నన్ను తిట్టిస్తున్నవ్‌. మగాడివైతే నాతో నువ్వు మాట్లాడు. మోదీ దగ్గరికెళ్లి అరుణ్‌జైట్లీ, కేసీఆర్‌ కాళ్లు పట్టుకోలేదా? కేసీఆర్‌ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నవ్‌. పదేళ్లు ఇక్కడే ఉండి పార్టీని కాపాడతానని చెప్పిన నువ్వు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా సర్దుకుని పోయినవ్‌. నువ్వు పోయింది అమరావతి కోసం కాదు. కేసీఆర్‌ ఒక్క లాత్‌ కొడితే అక్కడ పడ్డవ్‌. తెలంగాణలో పార్టీని సర్వనాశం చేసినవ్‌. నా మీద ఏమైనా మాట్లాడితే పురుగులు పడి చస్తవ్‌. నేనెవరికీ అన్యాయం చేయలే. నువ్వు నాకు అన్యాయం చేసినవ్‌. సిగ్గు లేదా నీకు. నువ్వు కులగజ్జి ఉన్నోడివి. రేవంత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు నేను మాదిగ వ్యక్తినని నా మీద చర్యలు తీసుకుంటవా?’’అని మోత్కుపల్లి ప్రశ్నించారు. 
‘దుర్మార్గుడివి, పాపాత్ముడివి, దుష్టుడివి అయినా నీతోనే ఉండాలనుకున్నా. ఎన్టీఆర్‌ని చంపినా ఆయన పెట్టిన జెండా కోసం నీతోనే ఉండాలనుకున్నా. నీ కోసం నన్ను వాడుకుని ప్రపంచమంతా నన్ను చెడ్డోడిని చేసిండు. నువ్వు నన్ను సస్పెండ్‌ చేసేదేంది? తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిన్ను సస్పెండ్‌ చేశారు’’అని బాబును మోత్కుపల్లి దుయ్యబట్టారు. ‘ఈ వెధవ కోసం. నీకు దిక్కు లేకపోతే దిక్కు నిలబడ్డా. సిగ్గుమాలినోడా. విశ్వాస ఘాతకుడా? నీతిమంతుల ముందు ఈ పాపాల భైరవుడు నిలబడలేడు’’అని మోత్కుపల్లి ఘాటుగా చేసిన వ్యాఖ్యలతో విస్తుబోవడం మీడియా ప్రతినిధుల వంతు అయింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.