మోత్కుపల్లి వెనుక బీజేపీ నేతలు..?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసి, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వెనుక ఎవరు ఉన్నారు..? ఏ ధైర్యంతో ఆయన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..? చంద్రబాబుకు, టీడీపీకి మోత్కుపల్లి ఎదురు తిరగడానికి అసలు కారణం ఏమిటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బీజేపీయేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న మోత్కుపల్లి.. ఉన్నట్లుండి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక బీజేపీ నేతలు ఉన్నారని, తెలంగాణలో టీడీపీని ఇంకా దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యంతోనే మోత్కుపల్లిని బీజేపీ నేతలు ఒక పావులా ఉపయోగించుకుంటున్నారని పలువురు చెప్పుకుంటున్నారు. కొద్దిరోజులుగా మోత్కుపల్లి బీజేపీలోకి వెళ్లాలనుకుంటున్నారని, మామూలుగా పార్టీ మారితే గవర్నర్ పదవి కోసమే అందులోకి వెళ్లారని అనుకుంటారేమోననే.. చంద్రబాబును బూతులు తిట్టి మరీ, వేటు వేయించుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ.. కొద్ది కాలంగా దళిత సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కోసం అన్వేషిస్తోంది. ఆ సమయంలోనే మోత్కుపల్లికి బీజేపీ గాలం వేసిందని, గవర్నర్ పదవి లేదా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కూడా సిద్ధమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  వాస్తవానికి మోత్కుపల్లి మొదట టీఆర్ఎస్‌లోనే చేరుదామనుకున్నారట. అయితే, భవిష్యత్‌లో టీడీపీ-టీఆర్ఎస్ కలిసి పని చేసే అవకాశం ఉండడంతోనే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారట. ఒకవేళ ఇదే నిజమైతే మోత్కుపల్లి, బీజేపీ ఏ మేరకు లాభపడతాయో చూడాలి..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.