మోత్కుప‌ల్లిని… ప‌క్క‌నేవున్నాగానీ… ప‌ట్టించుకోరు!

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో  రాజకీయాల్లోకి వ‌చ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే ఇప్ప‌డు సీన్ రివ‌ర్స‌య్యింది. గ‌త‌కొంత‌కాలంగా  చంద్ర‌బాబు… మోత్కుప‌ల్లిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్‌వినిపిస్తోంది! ఆమ‌ధ్య హైదరాబాద్‌‌లో తెలంగాణ టీడీపీ మహానాడు  జరిగింది. ఈ సభకు రావాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని తమ్ముళ‌కు ఆహ్వానం ప‌లికారు. అంతా హాజరయ్యారు. కానీ మోత్కుపల్లికి మాత్రం ఆహ్వానం అందలేద‌ట‌!. దీంతో ఆయన పబ్లిగ్గానే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు మే 28 టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి అంజలి ఘటించారు. ఆ తర్వాత చంద్రబాబుపై మీడియా సాక్షిగా నిప్పులు చెరిగారు. ఈ ప‌రిణామాలన్నీ చంద్ర‌బాబుకు మోత్కుప‌ల్లిపై ఆగ్ర‌హం క‌ల‌గ‌దానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  కాగా గ‌తంలో మోత్కుప‌ల్లి టీడీపీకీ వీర విధేయుడిగా ఉండేవార‌నే వాద‌న ఉంది.  తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీని టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ సమయంలో మోత్కుప‌ల్లి టీడీపీ నేతలపై విమ‌ర్శ‌లు రాకుండా చూసుకుంటూ, కారు పార్టీ నేతలపై ఆగ్ర‌హం వ్యక్తం చేశార‌ని అంటుంటారు.
అలాంటి మోత్కుపల్లిని చంద్రబాబు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశార‌నేది చాలామందికి మింగుడుప‌డ‌ని విష‌యంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రతిపక్ష టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీల నేత‌ల‌ను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కారు ఎక్కించుకున్నార‌నే వార్త వినిపిస్తుంటుంది. దీంతో తెలంగాణ‌లో టీడీపీకి దెబ్బ పడింది. ఈ స‌మ‌యంలో టీడీపీని వదిలి  కారు ఎక్కిన వారి కన్నా, ఓటుకు నోటు కేసులో రేవంత్ దొరికిపోయి పార్టీ పరువు తీశారంటూ మోత్కుపల్లి మీడియాకెక్కారు. దీనికితోడు  సైకిల్ పార్టీలో లీడర్లు కరవయ్యార‌ని,  తెలంగాణలో కారుతో… సైకిల్ పోటీ పడలేదని ఆరోపించారు. అలాగే  టీడీపీని కారు పార్టీలో కలిపేస్తే మంచిదంటూ  మోత్కుప‌ల్లి మీడియా ముందు రచ్చ చేశారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలోనే చంద్రబాబు… మోత్కుపల్లిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ స‌మ‌యంలో మోత్కుపల్లికి గట్టిగా మంద‌లించార‌ని టాక్‌! ఇటువంటి ఘ‌ట‌న‌ల‌తో  మోత్కుపల్లికి చంద్రబాబుకు మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఆ దూరం మరింతగా పెరిగింది.  ఈ స‌మ‌యంలోనే మోత్కుప‌ల్లి చంద్ర‌బాబుపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కుట్ర చేశారని.. చంద్రబాబు దొరకని దొంగ అని వ్యాఖ్యానించారు.ఈ విధ‌మైన మోత్కుప‌ల్లి వ్య‌వ‌హార‌శైలికి విసుగు చెందే ఆయ‌న‌ను బాబు పక్క‌పెట్టార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.