మోదీ ప్ర‌చారం క‌లిసొచ్చేనా!

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు పొలిటిక‌ల్ టెన్ష‌న్‌ను మ‌రింత పెంచుతున్నాయి. జ‌యాప‌జ‌యాలు.. రాహుల్‌, న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వానికి ప‌రీక్ష‌లా నిల‌వ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఏళ్ల అనుభవం మోదీ సొంతం. ఎత్తులు.. పై ఎత్తులు వేసేందుకు అమిత్‌షా వంటి తోడుంది. రాహుల్ ప‌రిస్థితి.. అమ్మ సోనియ‌మ్మ‌.. అనారోగ్యం. అనుభ‌వ‌లేమి..  ఏదోలా గ‌ట్టేక్కాల‌నేందుకు నానాతిప్ప‌లు. రాహుల్ ఇప్ప‌టికే ఐదారుసార్లు క‌న్న‌డ రాష్ట్రంలో ప‌ర్య‌టించాడు. కానీ మోదీ ఒక్క ప‌ర్య‌ట‌న‌తో రాజ‌కీయంగా ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చాడు. హిందువుల ఓట్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌టంలో విజ‌యం సాధించాడ‌ని క‌మ‌ల‌నాథులు ధీమా వ్య‌క్తంచేస్తున్నారు. ప్ర‌చార స‌భ‌ల‌కు జ‌నం పోటెత్త‌టంతో.. ఇప్ప‌టి వ‌ర‌కూ హంగ్ అనుకున్న వాళ్లు కాస్తా.. తూచ్‌.. 150 సీట్లు మావేనంటున్నారు.
ప్ర‌జ‌ల ఎమోష‌న్స్ గుర్తించ‌టంలో.. వాటిని అద‌ను చూసి వాడుకోవ‌టంలో మోదీకు ఎవ్వ‌రూ చాటిరారు. కేవ‌లం దేశ‌భ‌క్తి, హిందుత్వ ఎజెండాల‌తోపాటు.. మైనార్టీల‌కు మాదే ర‌క్షణ అంటూ చెప్ప‌గ‌ల‌రు. ఇప్పుడ‌దే బీజేపీకు అస్త్రం కూడా.. ఇరు పార్టీల మ‌ధ్య హోరా హోరు పోరులో ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లో బీజేపీ, జేడీఎస్‌, ద‌క్షిణాన కాంగ్రెస్‌కు బ‌లం ఉంద‌నే ప్ర‌చారం.. బెంగ‌ళూరు సిటీలో అత్య‌ధిక నియోజ‌క‌వర్గాలున్నాయి. ఇక్క‌డా బీజేపీదే హ‌వా అనే ప్ర‌చారం ఊపందుకుంది. ఇక‌. మోదీ రాక‌తో.. ఇది మ‌రింత పెరుగుతుంద‌ని లెక్క‌లు క‌డ‌తున్నారు. 40 నియోజ‌కవ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల తెలుగువారు ఎటు అనేది మాత్రం స‌స్పెన్స్‌.  రాయ‌ల‌సీమ జిల్లాల ప్ర‌జ‌లున్న చోట మాత్రం.. బీజేపీ వ్య‌తిరేక‌త ఉంది. అలాగ‌నీ.. కాంగ్రెస్ వైపు వెళ్లే అవ‌కాశాలూలేవు. మ‌రి వారంతా ఎటుంటారు.. ఎవ‌రి కొంప ముంచుతార‌నేది ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్థ‌కం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.