మోడీ ఈ సారి పోటీ చేసేది అక్కడే

ప్రధాని మోడీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందంటున్నారు. కర్నాటక సిఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం కమలం నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో వైరి వర్గం ఏకమయ్యేందుకు దోహదపడింది. ఎన్నడూ లేని విధంగా 16 పార్టీల నేతలు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడమే ఇందుకు కారణం. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు.. చంద్రబాబు లాంటి వారు రావడం పట్ల బీజేపీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. ఏడు రాష్ట్రాల సిఎంలు అక్కడ ఉండటం మాములు విషయం కాదు. అందుకే ఈసారి బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని మోడీలు అప్రమత్తమవుతున్నట్లు సమాచారం. 
అందుకే ఈ సారి మోడీ నియోజకవర్గం మారుతున్నారట. ఏకంగా రాష్ట్రాన్నే ఆయన మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిస్సాలోని పూరీ నుంచి ఆయన పోటీ చేయనున్నారని సమాచారం. పోయినసారి ఎన్నికల్లో వడోదర, వారణాసి నుంచి పోటీ చేసిన మోడీ తన దృష్టినంతా వారణాసిపై పెట్టారు. నిధులను ఎక్కువగానే ఖర్చు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో పోటీ చేస్తారట. అందులో ఒకటి పూరీ అని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. వడోదర స్థానాన్ని వదులుకున్న మోడీ వారణాసి వైపు మొగ్గు చూపడంతో గుజరాత్ లో చర్చనీయాంశమైంది. తన రాష్ట్ర ప్రజలు ఏమి అనుకోరనే ఆలోచనతోనే యూపీలో ఎంపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఒడిశాలోని పూరీ నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే క్షేత్ర స్థాయి పనులు ప్రారంభించాయట. బెంగాల్‌, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీ అంత బలంగా లేదు. కర్నాటకలోను చతికిల పడింది. అందుకే కొత్త ప్రాంతానికి వెళితే ఆ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించవచ్చనేది మోడీ ఆలోచనగా ఉంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.