పాపం మోడీ! లెక్కలడిగి అడ్డంగా బుక్కయ్యారా..?

దేశ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకొని భారత ప్రధాని సీట్లో నరేంద్ర మోడీని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన దేశాలు తిరుగుతుండటం చూసి భారత దేశ ఘనత ప్రపంచమంతా వెలుగెత్తి చాటుతున్నాడని అంతా భావించారు. కానీ తీరా లెక్కలు చూస్తే.. అవన్నీ అనవసర ఖర్చులే అని తేలిపోయింది. ఇంకా ఇలాంటి ఎన్నో అనవసర పనులు చేసిన మోడీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పతనానికి పూలబాట వేస్తూ వచ్చారు. ఇక దక్షిణ భారత దేశంలో అయితే మోడీ అంటేనే మండిపడుతున్నారు జనం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానానికి ఆయన పేరు తలచుకుంటేనే కట్టలు తెంచుకునే కోపం రగిలిపోతోందట. ఇదంతా ఆయనపై వారికున్న వ్యక్తిగత ద్వేషం కాదండోయ్..! విభజన హామీ అయిన ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసినందుకు గాను బీజేపీ పార్టీపై ప్రతీకారం తీర్చుకోవాలనే తాపత్రయం.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో మోడీ.. ఏపీలో సభ పెట్టి లెక్కలు అడగటంతో అక్కడి ప్రజలకు చిర్రెత్తే కోపం వచ్చేసింది. ఓ వైపు మోడీ గో బ్యాక్ అని పెద్ద ఎత్తున అలజడి సృష్టిస్తుంటే ఆయన మాత్రం బీజేపీ ఇస్తానంటే బాబు కాదన్నారు అని మాయమాటలు చెప్పబోయారు. అంతేకాదు ఇప్పటివరకు రాష్ట్రంలో కేంద్ర నిధులు వాడుకలోకి తీసుకోలేదా? అని కూడా ప్రశ్నిస్తూ ఆ లెక్కలు చెప్పాలని అన్నారు మోడీ. దీంతో ఏపీ జనానికి సుర్రుమనేసింది. ఆ సొమ్ములన్నీ కేంద్రానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీ రాష్ట్ర ఆదాయం పన్ను రూపంలో కేంద్రానికే వెళ్తోందిగా! ఎవరు ఏ వస్తువు కొన్నా సీజీఎస్టీ రూపంలో పన్ను, ఇతర కేంద్ర పనులన్నీ కేంద్రానికి వెళ్లాల్సిందే. వాటినే రాష్ట్రాల అభివృద్ధి కోసం కేటాయిస్తుంది కేంద్రం. ఇవన్నీ ఏపీ ప్రజలకు తెలియదనుకున్నాడేమో పాపం లెక్కలు అడిగి అడ్డంగా బుక్కయ్యారు మోడీ.

మేము కట్టే పన్నులు తీసుకొని.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎంతో కొంత మేరే నిధులిచ్చి వాటికి లెక్కలడుగుతారా? ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరిక విధానమా? అని సూటిగా మాట్లాడుకుంటున్నారు జనం. మరోవైపు మోడీ మాట్లాడిన మాటలపై నిన్న ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, మీరు కూడా ఏపీ నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలన్నీ చెప్పాలని కౌంటర్ వేయటంతో బీజేపీ నేతలంతా ఖంగుతిన్నారట. లెక్కలడిగి అడ్డంగా బుక్కయ్యారేంటి ఈ పెద్ద మనిషి? ఇప్పుడేం సమాధానం చెప్పగలం? అని మదనపడుతున్నాయట బీజేపీ శ్రేణులు. చూశారా ఏపీ ప్రజల గుండె ధైర్యం, చంద్రబాబుపై వారికున్న నమ్మకం ఎలా ఉందో!  

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.