చంద్రబాబుతో మోడీ మాట్లాడారట

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. మంత్రుల రాజీనామాలు, విభజన చట్టం అమలులో ఉన్న పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగిందంటున్నారు. మొత్తం 10 నిమిషాల పాటు వారి మధ్య మాటలు సాగాయంటున్నారు. అదే సమయంలో మా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళితే ఇబ్బంది పడతామని మోడీకి చంద్రబాబు చెప్పారంటున్నారు. లెక్కలు సరిగా ఇస్తే మరిన్ని నిధులు వచ్చేవని… ఆ పని ఎందుకు చేయడంలేదని మోడీ వైపు నుంచి ప్రశ్నలు వచ్చాయంటున్నారు. రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చింది. ఏంటనే విషయంపై మోడీ మాట్లాడారంటున్నారు. 
మోడీతో మాట్లాడేందుకు తాను అపాయింట్ అడిగినా అందుబాటులో లేకుండా పోయారని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే మోడీ ప్రత్యేకంగా చంద్రబాబుతో మాట్లాడారంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామాల ఆమోదంపై ఎటువంటి నిర్ణయం వెలువడబోతోందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఏపీలో టీడీపీ కూటమి నుంచి బీజేపీ తప్పుకోవడం కమలం పార్టీకి ఇబ్బందేనంటున్నారు. అదే సమయంలో కేంద్రంలో టీడీపీ మంత్రులు లేక పోవడం లోటేనని చెప్పాలి. ఏవైనా కేంద్ర నిధులకు సంబంధించి అడగాలన్నా.. నిధులు తెచ్చుకోవాలన్నా అంత తేలిక కాదంటున్నారు. మోడీ, చంద్రబాబు మధ్యలో పవన్ కల్యాణ్. ముగ్గురు కలిసి ఆంధ్రాప్రజలకు అన్ని రకాలుగా సాయ పడతామని చెప్పారు. హోదా ఇస్తామన్నారు మోడీ. తెప్పించి తీరుతామన్నారు బాబు. అలా చేయక పోతే ప్రశ్నిస్తామన్నారు పవన్. ముగ్గురు చేతులెత్తేయడంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు మోడీ టీమ్ నుంచి వైదొలిగే ఆలోనచ చేస్తున్నారట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.