మోదీ.. విందు రాజ‌కీయం!

క‌ర్ణాట‌క షాక్ నుంచి బీజేపీ కోలుకున్న‌ట్లు లేదు. అంత‌లోనే.. ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి ఇంకా ఊపిరి తీసుకోనివ్వ‌ట్లేదు. ఇప్ప‌టి దాకా మేకపోతు గాంబీర్యం ప్ర‌ద‌ర్శించిన అమిత్‌షా త్ర‌యం.. ఇక త‌మ ఎత్తుల‌కు కాలం చెల్లింద‌నే భావ‌న‌కు వ‌చ్చిన‌ట్టున్నారు. క‌న్న‌డ తీర్పు వ‌ర‌కూ.. ఇక త‌మ‌కు తిరుగులేద‌ని ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న క‌మ‌లం గ్రూపుకు.. మ‌రో గండం.. మెడ‌కు గుదిబండ‌గా మారింది. దీన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొద్ది నెల‌ల ముందే మేల్కోని.. చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మైంది. అయితే.. ఈ సారి.. అమిత్‌ను న‌మ్మ‌కుండా.. న‌రేంద్ర‌మోదీ స్వ‌యంగా రంగంలోకి దిగ‌టం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి కొద్ది నెల‌ల్లో రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసేందుకు స్వ‌యంగా మోదీ.. ఆయా రాష్ట్ర నేత‌లు, సీనియ‌ర్ల‌తో విందు భోజ‌నం చేశార‌ట‌. ఢిల్లీలో అత్యంత గోప్యంగా జ‌రిగిన స‌మీక్షాస‌మావేశంలో మోదీ  మూడు రాష్ట్రాల నేత‌ల‌కు సున్నిత‌మైన హెచ్చ‌రిక కూడా చేశార‌ట‌.

 

ఎందుకంటే. ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల్లోనూ  బీజేపీయే అధికారంలో ఉంది. మ‌రో ప‌ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో మొన్న క‌న్న‌డ ఓట‌ర్లు.. ఇచ్చిన తీర్పు భిన్నంగా వుంది.. బీజేపీకు మ‌ద్దతు ల‌భించిన‌ట్లుగా.. పెరిగిన ఓట్లు.. సీట్ల‌ను బ‌ట్టి.. బీజేపీ అంచ‌నా వేసుకుని ఆనంద‌ప‌డుతుంది.  కానీ.. ప్ర‌జ‌ల్లోకి గెల‌వాల్సిన చోట క‌మ‌లం వాడిపోవ‌టం కేవ‌లం మోదీ ప్రాభ‌ల్యం త‌గ్గ‌ట‌మే అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా ఏపీ, తెలంగాణ‌ల్లో బీజేపీ హామీలు నెర‌వేర‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే క‌మ‌లంపార్టీకు ఓట‌మి అంటూ విప‌క్షాలు  దాన్నే ప్ర‌చార అస్త్రంగా మార్చుకున్నాయి. ఇటువంటి వేళ సెమీఫైన‌ల్‌గా జ‌ర‌గ‌బోయే మూడు రాష్ట్ర ఎన్నిక‌లు బీజేపీకు చావు బ‌తుకుల స‌మ‌స్య‌గా మారింది. ఒక‌వేళ అక్క‌డ ఏ మాత్రం తారుమారైనా.. రేప‌టి ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంత‌య్యే అవ‌కాశాలున్నాయి. గ‌త ఎ న్నిక‌ల‌ వేళ హ‌స్తం పార్టీను వ్య‌తిరేకించిన ప్ర‌జ‌లు మోదీపై ఎన్నో అశ‌లు పెట్టుకున్నారు.  పైగా ఆయ‌న‌లాంటి నేత దేశానికి అవ‌స‌ర‌మ‌నే అంచ‌నాలు కూడా బీజేపీ అమాంతం  పెంచేసింది. దీంతో ఎంత‌గానో ఊహించుకున్న దేశ ప్ర‌జ‌ల నెత్తిన నోట్ల‌ర‌ద్దు, జీఎస్‌టీల రూపంలో వేసిన పిడుగులు ధాటికి జ‌నం విల‌విలాడిపోతున్నారు. అవే బీజేపీకూ స్పీడుబ్రేక‌ర్లుగా మారి.. బొక్క‌బోర్లాప‌డేంత వ‌ర‌కూ చేర్చాయి. అయినా.. వాటిపై దిద్దుబాటు చ‌ర్య‌ల వైపు మోదీ స‌ర్కారు క‌నీసం క‌న్నెత్తి చూడ‌ట్లేదు.

ఇవ‌న్నీ మోదీ బుర్ర‌ను ఇప్ప‌టికి తాకిన‌ట్టున్నాయి. అందుకే.. మూడు రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో కాషాయ జెండా ఎగురేసి.. సెమీస్‌లో నెగ్గాల‌నేది మోదీ వ్యూహం.. అందుకే క‌డుపారా పెట్టి.. బుర్రల‌ను హీటెక్కించి మ‌రీ పంపార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.