ఏపీ ఇసుక మాఫియాపై మోడీ ఆరా

పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో. అసలే ఏపీకి అన్యాయం జరుగుతుందని సిఎం చంద్రబాబు నాయుడు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. హోదా, ప్యాకేజి, విభజన నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డు పడుతోంది. అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని వివిధ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న ఇసుక మాఫియాపై ప్రదాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు అందింది. మెగస్సే అవార్డు గ్రహీత, జలసంరక్షణ నిపుణుడు రాజేంద్ర సింగ్ ఈ విషయమై ప్రధానికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరం. ఏపీలో ఇష్టానుసారంగా ఇసుక మాఫియా నదులను తవ్వేస్తోందని ఆరోపించారు. 
ప్రభుత్వం కనుసన్నల్లోనే అది జరుగుతుందని ఆరోపించారు. అది ఒక మాఫియాగా మారిందని, ఎవరైనా అభ్యంతరం చెబితే వారిపై దాడులు చేస్తున్నారని ప్రస్తావించారు. అసలే చంద్రబాబు అంటే వ్యతిరేకంగా ఉన్నారు మోడీ. ఇలాంటి సమయంలో బాబు సర్కార్ పై ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ జరపిపించాలని ఆయన మోడీని కోరారు. ఇందుకు మోడీ స్పందిస్తారా లేదా అనేది హాట్ టాపికైంది. ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు హద్దు మీరాయని గతంలోనే వైకాపా ఆందోళన వ్యక్తం చేసింది. అయినా సరే ఎక్కడా ఒక్క ఫిర్యాదు అందలేదు. పైగా అక్రమాలను అడ్డుకున్నందుకు ముసునూరు మాజీ ఎమ్మార్వో వనజాక్షి పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వంటి వారు దాడి చేశారనే ప్రచారం వచ్చింది. తప్పు చేసిన ఎమ్మెల్యే పై చర్య తీసుకోవాల్సిన చంద్రబాబు..ఇందుకు విరుద్దంగా అధికారి పై బదిలీ వేటు వేయడం విమర్శలకు తావిచ్చింది. 

1 Comment

  1. దాడి చేసారని ప్రచారం వచ్చిందా….అంటే ప్రచారమే గానీ దాడి జరగలేదని చెప్పడమా??? సిగ్గుండాలి …రాసే వాళ్లకి…ఓపెన్ గా వనజాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఆమెను భయపెట్టి బాబు కేసు లేకుండా చేసిన విషయం జ్ఞానం ఉన్న ఎవ్వడికైనా అర్థం అవుతుంది. ఈ వెబ్ సైట్ కి అందులో ఈ తుక్కు రాస్తున్న రైటర్ కి తప్ప.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.