చంద్రబాబు పై మోడీ ఆరా

ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు పై ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్ ఆరా తీస్తుందట. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు. ఏపీకి నిధులు తెప్పించే విషయంలో ఎలాంటి వైఖరితో ఉంటున్నాడనే సంగతి పై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు అందుతున్నాయట. ఏపీకి నిధుల ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళతామని చెప్పిన చంద్రబాబు తెల్లారే పాటికి మాట మార్చారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా కాదు వెళతానని చెప్పింది అని మాట దాటేశారు. కేంద్రంలో ఉంది బీజేపీ భాగస్వామ్య పార్టీలు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా కాదని ఎలా చెప్పగలరు. ఈ విషయంలో కేంద్రం నుంచి చంద్రబాబుకు సంకేతాలు వచ్చాయంటున్నారు. ఓటుకు నోటు కేసును వెలికి తీయాల్సి వస్తుందనే మాట చెప్పారనే వాదనుంది. అందుకే చంద్రబాబు వెనక్కు తగ్గాడంటున్నారు. 
ఓటుకు నోటు కేసు చంద్రబాబునే కాదు.. ఏపీని ఇరకాటంలో పెట్టే పరిస్థితికి తీసుకువచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు ఆ విషయంలో నోరు తెరవలేక పోతున్నారు. ప్రత్యేక ప్యాకేజి సంగతి గట్టిగా అడగలేని పరిస్థితికి వచ్చింది. అసలు ఏపీలో బీజేపీ నేతలు టీడీపీని తిట్టినా లైట్ తీసుకోవాలని తమ పార్టీ నేతలకు చెబుతున్నారు. అంతగా చంద్రబాబు భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందనే వాదన లేకపోలేదు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టడం వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ గా చంద్రబాబు ఆప్తుడు రమణను నియమించాలనే ప్రతిపాదన వచ్చిందట. కానీ ఆయన్ను కాదని మరొకరిని నియమించారు. తనకు అనుకూలమైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటే బావుంటుందనే ఆలోచనతోనే చంద్రబాబు తన వంతుగా పావులు కదుపుతున్నారంటున్నారు. అందుకే ఓటుకి నోటు కేసును బీజేపీ బూచిచూపి ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది. 
ఓటుకు నోటు కేసులో ఉన్న ఆడియో టేపు తనది కాదని చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పలేకపోయాడు. మిగతా విషయాలను ఖండించిన ఆయన బ్రీప్ డ్ మీ అన్న మాటలు తనవి కాదని చెప్పలేదు. దాన్ని పట్టుకుని చంద్రబాబును బీజేపి బ్లాక్ మెయిల్ చేస్తుందనే వాదన లేకపోలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇలా అన్ని విషయాలను పరిశీలించిన మీదట ప్రధాని మోడీ చంద్రబాబు తీరు పై వీలున్నంత తొందరగా రహస్యంగా ఆరా తీయిస్తున్నట్లు సమాచారం. 
ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేతలు ఎవరు.. ఏంటనే వైనం పైన ప్రత్యేక నివేదికలు తయారు చేశారట. మొన్న ప్రధాని మోడీ చంద్రబాబు మధ్య జరిపిన సమావేశంలోను సానుకూలం సంకేతాలు రాలేదని తెలుస్తోంది. ఫలితంగా మోడీని ఢీకొట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కానీ అంత ధైర్యం చాలడం లేదు. మోడీ వైరి వర్గం నేతలు కొందరు చంద్రబాబుతో కలిసేందుకు సిద్దమవుతున్నా అది బెడిసి కొడితే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారట. ఎల్ కే అద్వానీ, వాజ్ పేయి, తొగాడియా వంటి వారి ప్రాధాన్యతను తన వ్యూహంతో తగ్గించగలిగారు మోడీ. ఇప్పుడు చంద్రబాబును ఎదగనిస్తే తనకే ఎసరు వస్తుందని ఆలోచిస్తున్నారట మోడీ. అందుకే వీలున్నంత వరకు చంద్రబాబును దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 
పైకి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. కడుపులో కత్తులతో అన్నీ చేస్తామని చెబుతున్నారంటున్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా ఏమి అనలేని స్థితికి వచ్చారు చంద్రబాబు. మరోవైపు విపక్ష పార్టీ జగన్ ది అదే తీరు. పీకల్లోతు కేసుల్లో మునిగిపోయిన జగన్ కేంద్రాన్ని గట్టిగా అడగలేక పోతున్నారు. అవన్నీ మోడీకి కలిసొచ్చే అంశాలే. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.