మోడీ, అమిత్ షాలకు నిద్రలేని రాత్రులు

ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు నిద్రలేని రాత్రులు నడుస్తున్నాయి. అనుకుంది ఒక్కటీ. అయింది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటూ కాంగ్రెస్-జేడిఎస్ ల నేతలు పాటలు పాడుకుంటుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితి. అసెంబ్లీ లాబీల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాన్స్ లు వేశారంటేనే ఏం జరుగుతుందో అర్థమవుతోంది. అధికారం ఉంది. మందీ మార్భలం ఉంది. హోదా ఉంది. అన్నీ ఉన్నాయి. అయినా సరే. దేశవ్యాప్తంగా వారి ప్రాభవం తగ్గుతోంది. మకిలి అంటోంది. యడ్యురప్ప సిఎంగా ఎన్నికైతే..మరింతగా బీజేపీ పరువు గంగలో కలిసేది. కానీ ఇప్పుడు పరువు కొంతైనా మిగిలింది. చంద్రబాబు దెబ్బతోనే కర్నాటకలో బీజేపీ అబ్బా అందని టీడీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. ఇక వైరి వర్గం మీడియా తాము గట్టిగానే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడమని చెప్పుకుంటోంది.  
ఎలాగైనా కర్నాటకలో ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవాలన్న భారతీయ జనతా పార్టీ ఆశలు అడియాసలు కావడంతో కీలక నేతలకు నిద్ర పట్టడం లేదట. అందులోను యడ్డురప్ప భావోద్వేగంతో కూడిన ఉపన్యాసం ఇవ్వడం వారిని ఆందోళనలు గురి చేసింది. మంచి జరిగితే అది మోడీ ఖాతాలోకి వెళ్లేది. చెడు జరిగినా అదే పరిస్థితి రావడం వారికి ఇబ్బందినే. బలం లేని చోట బలపరీక్షకు సిద్ధం కావడం మాములు విషయం కాదు. బల పరీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఏమి చెప్పినా, అంతిమంగా ఆయన రాజీనామా చేయడం బీజేపీకి లాభించింది. కాంగ్రెస్ ,జెడిఎస్ ఎమ్ఎల్యేలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తిగా బెడిసి కొట్టడం మాములు విషయం కాదు. తమకు మెజార్టీ రాలేదు కనుక, ఎమ్మెల్యేల కొనుగోళ్ల కు పాల్పడలేదని పైకి చెప్పుకోవడానికి ఇప్పుడు బీజేపీ అవకాశం ఉంది. లేకపోతే ఆ కాస్త ఉండేది కాదు. 
జెడిఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చి ఉంటే అసలు బీజేపీ పరిస్థితి నల్లేరు మీద నడకలా ఉండేది. తామే ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న నమ్మకంతో వెళ్లి బోల్తా పడింది. కాంగ్రెస్ గోవా అనుభవం నేపధ్యంలో కాస్త ముందుగానే జాగ్రత్త పడింది. ఎలాగైనా కర్నాటకలో బిజెపిని అడ్డుకోవాలన్న అబిప్రాయంతో వారు అప్రమత్తం అయ్యారు. సుప్రీంకోర్టులోను గట్టిగానే తమ వాదనలు వినిపించారు. చివరకు సక్సెస్ అయ్యారు. దేవెగౌడ 18 మంది ఎమ్.పిలతో దేశ ప్రధాని అయితే, ఆయన కుమారుడు కుమారస్వామి ముప్పై 37 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అవుతున్నారు. కాంగ్రెస్  ఏం చెబితే అదే చేయాల్సి ఉంది కుమారస్వామి. మంత్రివర్గం కూర్పులో, ఆయా నిర్ణయాలు చేయడంలో కుమారస్వామికి స్వేచ్చ ఉండదు. కానీ లుకలుకలు అప్పుడే ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ తగ్గి జెడిఎస్ కు సహకరిస్తున్నా, డెబ్బైఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఎప్పుడో పుటుక్కున వెనక్కు తగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు. 
గవర్నర్ ఇచ్చిన పదిహేను రోజుల వ్యవధిని కేవలం ఒక్క రోజుకు కుదించడంతో కాంగ్రెస్, జెడిఎస్ లకు తమ ఎమ్మెల్యేలు ఎటూ పోకుండా కాపాడుకోగలిగారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలలోకాని, కేంద్రంలో కాని ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు గవర్నర్ తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోకుండా ఇది వెసులుబాటు అని చెప్పాలి. ఏదైనా ఇక ముందు బీజేపీ దూకుడు తగ్గుతోంది. రాబోయే మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఓటర్ల పైనే పడనుంది. తాము ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచన నుంచి మోడీ, అమిత్ షాలు ఇక వెనక్కు తగ్గే వీలుంది.  

1 Comment

  1. modi ki patanam start ayindi. ap ki chesina anyananiki ap prajala vusuru kotti modi kanumarugu avutadu. vinasakale vipareeta buddi. babuni , tdpini rajakeeyam ga edurkoleka finish chedamanukunte modi finish avutadu. ys rajasekhar reddy chanipoye one week mundu cbn ni finish chestanu ani ysr finish ayadu. modi ki ede jarugutundi.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.