మోడీలో అహంకారం పెరిగిందా…

ప్రధాని మోడీలో అహంకారం పాళ్లు ఎక్కువ అవుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీని స్థాపించిన వ్యక్తుల్లో ఒకరు ఎల్ కే అద్వానీ. అలాంటి వ్యక్తిని సరిగా గౌరవించడంలో ప్రధాని మోడీ తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రధాని పదవికి అడ్డు వస్తారనే కారణంతో ఆయన పై ఉన్నకేసులను తిరగదోడారని తెలుస్తోంది. అంతే కాదు..పార్టీ అంతర్గత వేదికల్లోను అద్వానీకి సరైన ప్రయార్టీ ఇవ్వడం లేదని సమాచారం. ఇటీవల త్రిపురలో జరిగిన సిఎం విప్లవ్ దేవ్ ప్రమాణ స్వీకార సభకు వచ్చినప్పుడు అద్వానీని అవమానించారు మోడీ. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం. కానీ అద్వానీ లాంటి నేత ముకుళిత హస్తాలతో నమస్కారం చేసినా..ప్రతి నమస్కారం చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.  
రెండు సీట్ల పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వాజపేయి, అద్వానీలదే. అందులో తిరుగే లేదు. గుజరాత్‌ అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కారణం అద్వానీనే. ఆ రోజు ఆయన పై వేటు వేయాలనే ప్రతిపాదన బీజేపీలో వచ్చినా…అద్వానీ అడ్డుకున్నారు. అదే అద్వానీని ఈ రోజు అవమానిస్తున్నారు మోడీ. అసలు మోడీ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారంటే కారణం అద్వానీనే. అలాంటి వ్యక్తిని గౌరవించక పోవడం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోనియా గాంధీ లాంటి వారే అద్వానీ వద్దకు వెళ్లి మరీ నమస్కారం చేసి వస్తారు. అంతగా గౌరవిస్తారు. అలాంటిది మోడీ కంటికి ఆయన కనపడటం లేదా అని అంటున్నారు. 
అద్వానీకి ముందున్న అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ లకు నమస్కారం చేశారు మోడీ. ఆ తర్వాత ఉన్న మాణిక్‌ సర్కార్‌, మురళీ మనోహర్‌ జోషి తదితరులను గౌరవించారు. కానీ వారి మధ్యలో ఉన్న అద్వానీ వైపు కన్నెత్తి చూడలేదు మోడీ. అంతే కాదు మోడీ వద్దకు రాగానే తల తిప్పేశారు. అద్వానీ పక్కన ఉన్న మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌తోను నవ్వుతూ మాట్లాడారు మోడీ. అద్వానీకి పలకరింపులేదు. త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్‌దేవ్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా అగర్తలలో జరిగిన ఈ ఘటన వైరల్ అయింది. ఇందుకు మోడీ ఎలాంటి బదులిస్తారో చూడాలి. 

1 Comment

  1. Vinasakale vipareeta buddi. Next pm Advani ani bjp prakateste bjp ki koncham labham. Etuvanti modi lanti pm ni Indian prajalu korukovadam ledu

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.