మోదీ యాక్ష‌న్ ప్లాన్‌.. మిగిలింది ఎల‌క్ష‌నే!

న‌రేంద్ర‌మోదీ.. 2014కు ముందు 2018 త‌రువాత అని చ‌దువుకోవాల్సిందే. న‌మో మోదీ అంటూ.. దేశ‌వ్యాప్తంగా యువ‌త మెద‌డులో నాటుకుపోయిన నాయ‌కుడు. గుజ‌రాత్ సీఎంగా ఆయ‌న సాధించిన విజ‌యాలు.. మాట‌లతీరు.. ద‌ర్పం.. అన్నింటినీ మించి బ్ర‌హ్మ‌చారిగా దేశ‌సేవ‌లో మోదీ అంటూ…బాకాలూదిన మీడియా అన్నీ క‌లిపి.. న‌రేంద్ర‌మోదీను 2014లో సూప‌ర్‌హీరోగా నిలిపాయి. పైగా డిజిట‌ల్ తెర‌పై ఏక‌కాలంలో ప‌ది ప‌దిహేను చోట్ల ప్ర‌సంగించిన తీరు కూడా బాగా ఆక‌ట్టుకుంది. టెక్నాల‌జీపై మోదీ స్పందించినంత‌గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రించి ఉండ‌రు. పైగా పావ‌లా చేస్తే.. ముప్పావ‌లా ప్ర‌చారం కూడా తోడైంది. ఎవ‌రికి ఏం కావాలో తీసుకోండి.. మాకేం కావాలో మేం రాబ‌ట్టుకోగ‌లం అనేంత‌గా చెల‌రేగారు.  అటువంటి నాయ‌కుడు స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేరు. విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు చెప్పినా.. దానికి త‌ప్ప‌కుండా ప్ర‌తిఫ‌లం ఇవ్వ‌కుండా ఉండ‌లేరు. పైగా.. బావోద్వేగాల‌కు అతీతంగా.. పెరిగిన నేప‌థ్యం కావ‌టంతో మోదీ తాను అనుకున్న‌ది చేసేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. దేశ‌ఖ్యాతి.. నీతి నిజాయ‌తీల విష‌యంలో దాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేం.

 

కానీ.. మ‌నుషులు.. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండే నేత‌ల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు సున్నితంగా ఉంటుంది. అటువంటి పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న మోదీ.. త‌న‌మాటే చెల్లుబాటు కావాల‌నుకుంటున్నారు. పైగా.. త‌నకు ఎదురుతిరిగే వ్య‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నారు. ఏపీ సీఎం  చంద్ర‌బాబునాయుడు విష‌యంలో వ్య‌క్తిగ‌త వైరం.. ఏపీపై క‌క్ష‌సాధింపున‌కు కార‌ణ‌మైంది. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో ఇది తెలిసిన చంద్ర‌బాబు.. జాగ్ర‌త్త‌గా ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. మోదీ మ‌న‌సెరిగిన నేత‌గా చంద్రుడు క‌రెక్టే. కానీ.. అది  తెగేంత వ‌ర‌కూ వ‌చ్చేస‌రికే.. బాబులో ఓపిక న‌శించింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిపక్షాల ఒత్తిడి కూడా బాబును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇటువంటి ప‌రిణామం.. ప‌దేళ్ల క్రితం అయిన‌ట్ల‌యితే బాబు సంయమ‌నంగా ఉండేవారే. కానీ.. రాజ‌ధాని నిర్మాణం.. భావోద్వేగాలు.. వ‌యసురీత్యా త‌లెత్తిన ఇబ్బందులు. వార‌సుడిగా లోకేష్‌ను నిల‌బెట్టాల‌నే త‌ప‌న‌.. అన్నీ ఒక్క‌సారి చంద్రుడి చుట్టూ అస‌హ‌నాన్ని పెంచాయి. తెగ‌తెంపుల వ‌ర‌కూ చేర్చాయి. అయితే.. ఇది మోదీ ఊహించ‌ని ఘ‌ట‌న‌. అందుకే.. చంద్ర‌బాబు అంటే.. ప‌డ‌ని.. కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌ను త‌న వైపున‌కు తిప్పుకునేలా వేసిన ఎత్తుగ‌డ చంద్ర‌బాబును కించ‌ప‌ర‌చ‌టం. అదే స‌మ‌యంలో కేసీఆర్ స‌మ‌ర్థ‌త‌ను లేవ‌నెత్త‌డం.. ఒక రాష్ట్రం మిస్స‌యినా.. పంతం నెర‌వేరుతుంది. చంద్ర‌బాబునాయుడిని జ‌నాల్లో ప‌లుచ‌న చేయ‌టం.. త‌ద్వారా కేసీఆర్ ద్వారా.. ఇద్ద‌రు సీఎంల ప‌నితీరు నిర్ణ‌యించుకోమంటూ స‌గ‌టు ఆంధ్రా ఓట‌ర‌కు ప‌రీక్ష పెట్ట‌డం.. ఎమోష‌న‌ల్‌గా ఇది చంద్ర‌బాబును బ‌ల‌హీన‌ప‌రిచేది.. రాజ‌కీయంగా కూడా.. యూట‌ర్న్ బాబుగా రేప‌టి కూట‌మిలో చంద్ర‌బాబు రోల్‌ను పరిమితం చేసేందుకు అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.