బోండా చుట్టూ.. ఉచ్చు బిగుస్తోందా!

విజ‌య‌వాడ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు ఇబ్బందులు ఇప్ప‌ట్లో తప్పేలా లేవు. ర‌వాణాశాఖ అధికారిపై దాడికి దిగిన వివాదంతో మంత్రిప‌ద‌వికి దూర‌మ‌య్యార‌నేది తెలిసిందే. ఇప్పుడు.. ఎమ్మెల్యే సీటుకే ఎస‌రు తెచ్చేలా. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడి భూమిని క‌బ్జా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు చుట్టుముట్టాయి. గ‌తంలో లైట్‌గా తీసుకున్న క్ర‌మంగా అవ‌న్నీ వాస్త‌వ‌మ‌నే విధంగా సాక్ష్యాలు క‌నిపిస్తుండ‌టంతో దీన్నుంచి త‌ప్పించుకోవ‌టం అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇబ్బందే అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌తో త‌ల‌బొడిపి క‌ట్టిన ప్ర‌భుత్వం మ‌రోసారి ఇటువంటి ఘ‌ట‌న‌ల‌ను పున‌రావృతంగాకుండా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగానే ఆర్డీవో స‌మ‌క్షంలో ఎమ్మెల్యే స‌తీమ‌ణి, అనుచ‌రుల‌ను విచారించ‌నున్నారు. ఇరువ‌ర్గాల నుంచి వారి వ‌ద్ద వున్న డాక్యుమెంట్స్‌ను ప‌రిశీలిస్తున్నారు. గ‌తేడాది అబ్దుల్ అనే వ్య‌క్తి వ‌ద్ద మాగంటిబాబు 75 సెంట్ల స్థ‌లాన్ని రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. అక్క‌డ డెవ‌ల‌ప్‌మెంట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దానిపై వివాదం ఉంద‌ని గ్ర‌హించిన ఎమ్మెల్యే తాను డిసెంబ‌రులోనే రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే త‌న‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. పైగా.. తాను దోషిగా నిర్దార‌ణ అయితే రాజ‌కీయాల నుంచి వైదొలుగుతానంటూ స‌వాల్ విసిరారు. గ‌తంలోనూ కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న యువ‌తి వున్న ఇంటిని ఖాళీ చేయించి వివాదాల్లో నిలిచిన ఉమా.. త‌న అనుచరుల‌తో ఖాళీ స్థ‌లాల‌పై క‌న్నేశార‌నే  ఆరోప‌ణ‌ల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఉమా త‌న‌యుడు కారు రేసింగ్‌ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తూ రోడ్ యాక్సిడెంట్‌కు కార‌ణ‌మ్యార‌నే విష‌యం అప్ప‌ట్లో క‌ల‌క‌లం సృష్టించింది. ఇన్ని వివాదాలు చుట్టిముట్టిన నేత‌గా.. టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. అధినేత చంద్ర‌బాబునాయుడు కూడా.. ఈ విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. త‌ర‌చూ వివాదాల్లో మునిగితేలుతూ.. పార్టీ ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బార్చే నేత‌ల చిట్టా ఇప్ప‌టికే బాబు వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ లెక్క‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వివాద నేత‌ల‌కు.. చెక్ చెప్ప‌టం అనివార్యం కావ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.