బాహుబలికి పని చేయక పోయినా అవార్డు ఇచ్చారు

65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే అవి తప్పుల తడకగా ఉన్నాయి. అవార్డుల కమిటీ అధ్యక్షులు, దర్శకుడు శేఖర్ కపూర్ జాబితాను ప్రకటించారు. ఈ సారి తెలుగు చిత్రాలకూ స్థానం దక్కింది. యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిన ఘాజీ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రాగా… బాహుబలికి మూడు అవార్డులు దక్కాయి. బాహుబలి ది కంక్లూజన్ యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీ మొఘల్‌ను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా జ్యూరీ ప్రకటించింది. అబ్బాస్ అలీకి ఈ సినిమాకు సంబంధం లేదు. ఎందుకు అలా ప్రకటించారో అర్థం కాని పరిస్థితి. సినిమా పేర్లల్లోను ఆ ప్రస్తావనే లేదు. కానీ ఇలా తప్పుగా ప్రకటించడంపై దుమారం రేగుతోంది. అసలు నపి చేయని వారికి అవార్డులు ఇస్తారా అంటూ తెలుగువారు ఆందోళన వ్యక్తం చేశారు.
‘బాహుబలి’ యాక్షన్ డైరెక్టర్ విషయంలో పెద్ద తప్పే జరిగింది. ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ దీనిపై స్పందించారు. ‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? ఆయన అసలు బాహుబలి-1 లేదంటే బాహుబలి-2కి పని చేయలేదని చెప్పారు. బాహుబలి’కి యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్ పని చేసిన సంగతి తెలిసిందే. అతని పేరుబదులు పొరపాటుగా అబ్బాస్ అలీ వచ్చిందా లేక మరో కారణముందా అనేది తెలియాల్సి ఉంది. 
బాహుబలి యాక్షన్ డైరెక్టర్‌కు బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా జ్యూరీ అవార్డు దక్కింది. బాహుబలి కంక్లూజన్‌కు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో కూడా చోటు దక్కింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా బాహుబలి2 సత్తా చాటింది. మరోవైపు ఉత్తమ నటిగా మామ్ సినిమాకు గాను.. శ్రీదేవికి అవార్డును ప్రకటించారు. 
మరోవైపు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సినిమాల జాబితా ఇలా ఉంది. 
ఉత్తమ తెలుగు చిత్రం – ఘాజీ
ఉత్తమ బెంగాలీ చిత్రం- మయూరాక్షి
ఉత్తమ అస్సామీ చిత్రం- ఇషు
ఉత్తమ తమిళ చిత్రం – టూలెట్
ఉత్తమ గుజరాతీ చిత్రం- డీహెచ్‌హెచ్
ఉత్తమ మలయాళ చిత్రం- తొండిముత్తళుం ద్రిక్‌సాక్షియుం
ఉత్తమ హిందీ చిత్రం- న్యూటన్
ఉత్తమ కన్నడ చిత్రం- హెబ్బెట్టు రమక
దాదాసాహెబ్‌ పాల్కే అవార్డ్‌- వినోద్‌ఖన్నా 
ఉత్తమ నటి-శ్రీదేవి (మామ్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్‌ రెహమాన్‌ (కత్రు వెలియాదు)
ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా లదాక్‌
స్సెషల్‌ జ్యూరీ అవార్డ్‌- నాగర్‌ కీర్తన్‌ (బెంగాలీ)
ఉత్తమ దర్శకుడు: జయరాజ్(భయానకం)(మలయాళం)
ఉత్తమ కథా చిత్రం: విలేజ్ రాక్‌స్టార్స్(అస్సామీ)
ఉత్తమ సినీ విమర్శకుడు- గిరిధర్ ఝా
ఉత్తమ నృత్య దర్శకుడు- గణేష్ ఆచార్య (టాయ్‌లెట్ కీ ప్రేమ్ కథా)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్- రామ్ రజాక్(నాగర్ కీర్తన్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్- సంతోష్ రాజన్(మలయాళం)
బెస్ట్ ఎడిటింగ్- రీమా దాస్ (అస్సామీ చిత్రం)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్- షాషా తిరుపతి
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కేజే యేసుదాసు
ఉత్తమ సహాయ నటి- దివ్యదత్త (ఇరాదా- హిందీ)
ఉత్తమ సహాయ నటుడు- ఫహద్ ఫాజిల్
ఉత్తమ సామాజిక చిత్రం- ఆలోరుక్కం
ఉత్తమ బాలనటుడు (భనితా దాస్- విలేజ్ రాక్‌స్టార్స్)
మే 3న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానం జరగనుండగా.. శ్రీదేవికి వచ్చిన జాతీయ ఉత్తమ నటి అవార్డును కూతురు జాన్వీ తీసుకోనుంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.