పొరపాటు పడ్డ చంద్రబాబు

బమ్మెర పోతన రామాయణం రాశారని చెప్పారు ఏపీ సిఎం చంద్రబాబునాయుడు. పోతన రామాయణం రాయలేదు. భాగవతం రాశారు. ఆ సంగతి మర్చిపోయినట్లున్నారు చంద్రబాబు. బమ్మెర పోతన ‘వీరభద్ర విజయము’, ‘భోగినీ దండకము’, ‘భాగవతము’, ‘నారాయణ శతకము’ వంటి రచనలు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన సీతారాముల కల్యాణ్య వేడుకల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. బమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని చంద్రబాబు చెప్పారు. ఈ సంగతి విన్న సాహితీ వేత్తలకు అనుమానం వచ్చింది. చంద్రబాబు చెప్పారంటే నిజమే అనుకుంటారు అంతా. అందులోను సిఎం స్థాయిలో పొరపాటు చేయడంతో విపక్షాలకు వరంగా మారింది. 
సాహిత్య విషయాల పై చంద్రబాబుకు బాగానే అవగాహన ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే వరుస మాటల్లో అలా వచ్చి ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కాదు కాదు చంద్రబాబుకు అసలు భారతం ఎవరు రాశారు..భాగవతం, రామాయణం ఎవరు రాశారో తెలియదని వైకాపా అంటోంది. ఇంత కంటే మంచి అవకాశం దొరకదనుకున్న ప్రత్యర్థి వర్గం మీడియా ఊదరగొట్టేస్తోంది. అదండీ రాజకీయం…  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.