ఆదెన్న‌.. క‌డ‌ప‌లో దెబ్బేస్తున్నాడుగా!

మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి క‌డ‌ప అంతా త‌న చెప్పుచేత‌ల్లోనే ఉండాల‌నే తాప‌త్ర‌యం పెరిగింది. సీఎం చంద్ర‌బాబునాయుడు వైసీపీ నుంచి ఆహ్వానించ‌టం.. పైగా మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డాన్ని.. త‌న గొప్ప‌త‌నంగానే భావిస్తున్న‌ట్టుగా తెలుగుత‌మ్ముళ్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి క‌డ‌ప జిల్లాలో వైఎస్ కుటుంబానిదే హ‌వా. అయితే.. అక్క‌డ కూడా ప‌సుపు జెండా ఎగుర‌వేయాల‌నే ఉద్దేశం.. వైసీపీకు చెక్ చెప్పాల‌నే ల‌క్ష్యంతో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నాటి నుంచి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ వ‌చ్చారు. అక్క‌డ జ‌గ‌న్‌కు కుడిభుజంగా ఉన్న నేత‌లు.. వ్య‌తిరేకుల‌ను ఏక‌తాటిపైకి తెచ్చేందుకు దాదాపు రెండున్న‌రేళ్లు శ్ర‌మించార‌నే చెప్పాలి.

గ‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దాన్ని పీక్‌కు తీసుకెళ్లారు. సీఎం ర‌మేష్‌, సుజ‌నాచౌద‌రి, గంటా, లోకేష్ అంద‌రూ.. అక్క‌డే ఉన్నారు. అందుకే.. ఆదినారాయ‌ణ‌రెడ్డి సైకిల్ ఎక్క‌టాన్ని అంద‌రూ వ్య‌తిరేకిస్తున్నా బాబు మాత్రం.. కండువాక‌ప్పి.. ఏకంగా మంత్రిప‌ద‌వే క‌ట్ట‌బెట్టాడు. ఇది మింగుడుప‌డ‌ని తెలుగు దేశం నేత‌లు.. బాబుపై పీక‌లవ‌ర‌కూ కోపం పెంచుకున్నారు. మంత్రి ప‌ద‌వి రావ‌ట‌మే అల‌స్యం ఆది గ‌ణం.. పెత్త‌నం చెలాయించ‌టం ప్రారంభించింది. సీఎం ర‌మేష్ కాంట్రాక్టుల‌కు అడ్డుప‌డుతూ అల‌జ‌డి సృష్టించారు. బ‌హిరంగ స‌భ‌ల్లోనే ఇరు వ‌ర్గాలు కుమ్ములాట‌కు దిగేంత వ‌ర‌కూ దిగ‌జారాయి. ఆది ఏకంగా.. సుజ‌నా, ర‌మేష్‌ల‌పై దుమ్మెత్తిపోశారు. అస‌లు తాను లేక‌పోతే.. టీడీపీ జిల్లాలో ఉండ‌ద‌నే సంకేతాలు పంపారు. దీనికి ప‌రాకాష్ట‌. జ‌మ్మ‌ల‌మ‌డ‌గు నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌దండ్లూరు లో సంప‌త్ అనే ఓ కానిస్టేబుల్ వివాహంలో జ‌రిగిన గొడ‌వే. పెళ్లివేడుక‌కు.. ఆదినారాయ‌ణ‌రెడ్డితోపాటు. ఆ కానిస్టేబుల్ వైసీపీ నేత అవినాష్‌రెడ్డికి కూడా శుభ‌లేఖ‌లిచ్చాడు.

దీంతో ఇద్ద‌రు నేత‌లు.. వివాహానికి హాజ‌ర‌య్యారు. త‌న‌ను పిలిస్తే స‌రిపోయేదానికి.. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గానికి కూడా ఆహ్వానం ఇస్తారా! అంటూ ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌నుషులు చెల‌రేగార‌ట‌. అవినాష్‌రెడ్డి గ్రామంలోకి వ‌స్తే..ఊరుకోమంటూ ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గం వీరంగం వేస్తూ.. పెళ్లికి వేసిన షామియానాలు కుప్ప‌పోశారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి రాబోయే ప్ర‌య‌త్నం చేసినా అడ్డుకున్నారు. ఇటు అయిన‌వాళ్లను.. అటు ప్ర‌త్య‌ర్థుల‌ను ఇబ్బందికి గురిచేస్తూ.. ఆది వ‌ర్గం సాగించిన దారుణాల‌పై తెలుగు త‌మ్ముళ్లు కూడా ఒకింత ఆస‌హ‌నానికి గుర‌వ‌తున్నార‌ట‌. ఇప్ప‌టికే విష‌యం తెలిసిన సీఎం చంద్ర‌బాబు వారికి క్లాసు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా.. ఏదో పొడిచేస్తాడ‌ని అధినేత గంపెడాశ‌లు పెట్టుకుంటే.. అస‌లుకే ఎస‌రు పెడుతున్నాడంటూ.. దేశం నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.