వారంతా జ‌గ‌న్‌పై క‌క్షక‌ట్టారా?

ఏపీ రాజ‌కీయాలు రానురాను సంక్లిష్టంగా త‌యార‌వుతున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో బ‌హిరంగంగానే టీడీపీ పొత్తు పెట్టుకుంది. దాంతో మైనార్టీలు ఆపార్టీని దూరం పెట్టిన విష‌యం విదిత‌మే! అయితే అదే స‌మ‌యంలో వారంతా జ‌గ‌న్ కి మొగ్గు క‌నిపించింది. ఏపీలో మైనార్టీలు అత్య‌ధికంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న స‌త్తా చాటింది. కానీ ఇప్పుడు ఆ సీన్ మార‌నుంద‌ని తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ బంధం తెగిపోగా, వైసీపీకి బీజేపీతో కొంత ద‌గ్గ‌రి సంబంధాలు ఏర్ప‌డ్డాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌గ‌న్ ఏపీ ప్ర‌యోజ‌నాలే ముఖ్యమంటున్నారుగానీ బీజేపీ, కాంగ్రెస్ ల‌ను వ్య‌తిరేకిస్తామ‌ని ఎప్పుడూ చెప్ప‌డం లేదు. దాంతో మైనార్టీలు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తివ్వ‌డంలో సందిగ్ధంలో ప‌డ్డార‌ట‌! దీనికితోడు బీజేపీ, వైసీపీ బంధం పై టీడీపీ వ్య‌తిరేక తీవ్రంగా ప్ర‌చారం చేస్తోందనే వాద‌న వినిపిస్తోంది. గ‌త‌ రంజాన్ సంద‌ర్భంలో అన్ని మ‌సీదుల వ‌ద్ద టీడీపీ మ‌ద్ద‌తుదారులు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ జ‌గ‌న్ వైఖ‌రిని విమ‌ర్శించినట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైనార్టీల ఓట్ల విష‌యంలో జ‌గ‌న్‌ న‌ష్ట‌పోయేలాంటి పరిస్థితులు క‌నిపిస్తున్నాయి.
ఏపీలో ముస్లీంల ప్ర‌భావం రాయ‌ల‌సీమ‌లో అధికంగా క‌నిపిస్తుంది. అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ రెడ్డి, ముస్లీం ఓటుబ్యాంకుతోనే గ‌ట్టెక్కారని తేలింది. ముస్లీం ఓట్లు ఎక్కువ‌గా ఉన్న‌ టాప్ 20 సీట్ల‌లో 18 స్థానాల‌ను వైసీపీ గెలుచుకున్న‌దాఖ‌లాలున్నాయి. వాటిలో కడప, రాయ‌చోటి, మైదుకూరు, రాజంపేట, కమలాపురం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, కర్నూల్, పుంగనూరు, మదనపల్లి, కదిరి, పెనుగొండ, పీలేరు, నెల్లూరు సిటీ, హిందూపురం, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, ఆదోని, ఎమ్మిగ‌నూరు ప్రాంతాలు ముస్లీంలు అత్య‌ధికంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు. కాగా హిందూపూర్, ఎమ్మిగ‌నూర్ మాత్ర‌మే టీడీపీకి ద‌క్కాయి. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మైనార్టీల ఓట్ల విష‌యంలో  వైసీపీ కి న‌ష్టం క‌లిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక గ‌డిచిన ఎన్నిక‌ల్లో ముస్లీంల‌కు టిక్కెట్లు కేటాయించ‌కుండా టీడీపీ  వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ వ‌ర్గాన్ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి టీడీపీ సిద్ధ‌ప‌డితే అది కూడా జ‌గ‌న్ దూకుడుకు గండికొట్టిన‌ట్ట‌వుతుంద‌నే వార్త‌లు వ‌నిపిస్తున్నాయి.  మొత్తంగా మైనార్టీలు జ‌గ‌న్ తీరుపై ఒకింత కినుక వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకే జ‌గ‌న్ మైనార్టీల‌పై త‌న వైఖ‌రి మార్చుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.