కాకినాడ నుంచి మెగా బ్రదర్ పోటీ?

ఏపీలో రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు చాలా కొత్త ముఖాలు తెర ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రాజకీయ పార్టీల అధినేతలు కూడా సై అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో ఈసారి ముక్కోణపు పోటీ జరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో కొత్తగా వచ్చిన జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు పలువురు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో  మరో ఆస్తక్తికరమైన వార్త వెలుగు చూస్తోంది. ఈసారి పోటీలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూడా ఉంటారట. అదికూడా కాపులకు కంచుకోటగా ఉన్న గోదావరి జిల్లాల నుంచే మెగా బ్రదర్ పోటీ ఉంటుందని భోగట్టా! ఇందుకోసం ఆయన ఓ సేఫ్ సీటుని కూడా కేటాయించారని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి మెగా బ్రదర్ నాగ్రేంద్ర బాబు పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ సొంత సామాజిక వర్గం విశేషంగా ఉండడంతో పాటు, పవన్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. కాకినాడపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ అక్కడ చేరికలను బాగా ప్రోత్సహిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యనే మాజీ మంత్రి ముత్తా గోపాలక్రిష్ణ జనసేనలో చేరడంతో కాకినాడలో పార్టీకి నూతన ఉత్తేజం  వచ్చిందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా మరింతమందిని తనవైపు తిప్పుకోవడం ద్వారా ఇక్కడ నుంచి తనబ్రదర్‌ని ఎలాగైనా గెలిపించుకోవాలని పవన్ తాపత్రయపడుతున్నారని సమాచారం. మరోవైపు ఇక్కడి నుంచి బలమైన టీడీపీ, వైసీపీ రంగంలో ఉన్నాయి. రెండింటినీ తట్టుకుని నాగబాబు గెలుపు సాధ్యమేనా అనేది వేచిచూడాలి. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ పోటీ చేసే స్థానంపై అటు జనసేన పార్టీలోనే కాకుండా పవన్ ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలి కొన్ని పరిణామాలను బట్టి చూస్తే పవన్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారేమో అనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.