బాల నటుడి నుంచి నటుడిగా ఎదిగిన భరత్

బాల నటుడు భరత్ గుర్తున్నాడా? హీరోయిన్లకు తమ్ముడిగా నటిస్తూ తనదైన కామెడీని పండించేవాడు. త‌న చిన్న వ‌య‌సులోనే ఎన్నో తెలుగు సినిమాల్లో అత్యద్భుతంగా న‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు భ‌ర‌త్‌. బొద్దుగా, ముద్దుగా ఉండే భరత్ దాదాపు 45 సినిమాల్లో బాల నటుడిగా చేశాడు. వెంకీ, పోకిరి, ఢీ, రెడీ, బిందాస్, దుబాయ్ శీను, ర‌గ‌డ‌, కింగ్‌, న‌మో వెంక‌టేశ వంటి సినిమాల్లో భ‌ర‌త్ న‌ట‌న ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. రెడీ, బిందాస్ సినిమాల్లో భరత్ నటనకుగానూ నంది అవార్డులు రావడం విశేషం.

తమిళనాడులో పుట్టిన భరత్ సినిమాలతోనే పెరిగి పెద్ద‌య్యాడు. బాల నటుడిగా బొద్దుగా కనిపించిన భ‌ర‌త్.. ఇప్పుడు కొంచెం బరువు తగ్గి యువ‌కుడిగా మారి హీరో స్నేహితుడి పాత్ర‌లో క‌నిపించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్న ‘ఏబీసీడీ’ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని అల్లు శిరీష్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. ‘‘నా `ఏబీసీడీ` సినిమాలో మాస్ట‌ర్ భ‌ర‌త్ ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్‌లోక‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మార‌బోతున్నాడు. వెల్‌క‌మ్ భ‌ర‌త్‌. ఇప్పుడు ఇత‌ణ్ని చూస్తే ఎవ్వ‌రూ గుర్త‌ప‌ట్ట‌లేరు. కానీ, శ్రీ చిలిపి వెన్నెల కిషోర్ గుర్తుపట్టాడు. కాకా కో ప్ర‌ణామ్‌’’ అంటూ ట్వీట్ చేశాడు. భ‌ర‌త్ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటో చూసి హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఆశ్చ‌ర్య‌పోయింది. ‘ఓ మైగాడ్‌.. ఎంత ఎదిగిపోయాడు. `ర‌గ‌డ` సినిమాలో అతనితో క‌లిసి న‌టించాను. ఎంతో ఎంజాయ్ చేశాను.’ అంటూ ప్రియ‌మ‌ణి ట్వీట్ చేసింది.

ఇప్పటి వరకు భరత్ నటించిన సినిమాలు ఇవే…

Eedu Gold Ehe (2017)
Inji Iduppazhagi / Size Zero (2015)
Alludu Seenu (2014)
Autonagar Surya (2014)
Doosukeltha (2013)
Baadshah (2013)
Sarocharu (2012)
Denikaina Ready (2012)
Yamudiki Mogudu (2012)
Naa Ishtam (2012)
Ramadandu (2012)
Nippu (2012)
Mirattal(2012)
Veedu Theda (2011)
Dookudu (2011)
Badrinath (2011)
Veera (2011)
Mr. Perfect (2011)
Ragada (2010)
Baava (2010)
Uthama Puthiran (2010)
Komaram Puli (2010)
Rama Rama Krishna Krishna (2010)
Bindaas (2010)
Namo Venkatesa (2010)
Malli Malli (2009)
Saleem (2009)
Bumper Offer (2009)
Ninnu Kalisaka (2009)
Oy! (2009)
Aa Okkadu (2009)
Ekaloveyudu (2008)
King (2008)
Dongala Bandi (2008)
Chintakayala Ravi (2008)
Siddu from Sikakulam (2008)
Rainbow (2008)
Ready (2008)
Kantri (2008)
Dubai Seenu (2007)
Pokkiri (2007)
Dhee (2007)
Andala Ramudu (2006)
Pokiri (2006)
Happy (2006)
Nee Navve Chalu (2006)
Manasu Maata Vinadu (2005)
Venky (2004)
Anandamanandamaye (2004)
Pedababu (2004)
Anji (2004)
Winner (2003)
Panchathanthiram (2002)
Naina (2002)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.