మనసుకు నచ్చింది మూవీ రివ్యూ

రేటింగ్ : 2.5/5
నటీ నటులు : సందీప్ కిషన్, అమైరా దస్తూర్‌, త్రిదా చౌదరి, అదిత్‌ అరుణ్, బేబీ జాన్వీ తదితరులు
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
నిర్మాత : సంజయ్‌ స్వరూప్‌, పి.కిరణ్‌
సంగీతం : రాధ
మాటలు : సాయి మాధవ్ బుర్రా
ఛాయాగ్రహణం : పీ. కిరణ్
పరిచయం…
సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా మంజుల సినీ పరిశ్రమలో అడుగుపెట్టి చాలా కాలమే అయింది. తొలి సినిమా షో తోనే జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత నిర్మాతగా కొన్ని సినిమాలు చేసింది. చివరకు దర్శకత్వం వైపు అడుగులు వేంది. ఆమె తీర్చిదిద్దిన సిినిమానే మనసుకి నచ్చింది. పకృతిని కథగా తీసుకుని తీశారా మూవీని. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో తెలుగు ప్రేక్షకుల  ముందుకు వచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు తన సోదరి కోరిక మేరకు వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింతగా సినిమా పై హైప్ ను పెంచింది. ఈ నేఫధ్యంలో సినిమా ఎలా ఉందో చూద్దాం…
కథలోకి వెళితే…
సూరజ్ ( సందీప్ ) నిత్యాలు ( అమైరా) లు మంచి స్నేహితులు. కానీ వారిద్దరు ప్రేమించుకున్నారని కుటుంబ సభ్యులు భావిస్తారు. వారికి పెళ్లి చేసేందుకు సిద్దమవుతారు. కానీ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని వారు చెబుతారు. అందుకే ఎవరికీ చెప్పా పెట్టకుండా గోవాకు టూర్ వెళతారు. ఇతర స్నేహితులతో కలిసి గోవాకి చేరుకుని ఎవరి పనుల్లో వారు బిజీ అవుతారు. సూరజ్ కు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. దాని కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అయినా కుదురుగా ఉండలేకపోతాడు. మరోవైపు నిత్య సరదాగా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ గా గడపాలనుకుంటోంది. ఎవరికీ వారే తమ కోసం కొత్త పార్టనర్స్ ని ఎంచుకుంటారు. ఈ సమయంలో నిఖితా (త్రిదా చౌదరి) అనే అమ్మాయి లవ్ లో పడతాడు సూరజ్. అలానే అభయ్  అనే అతను నిత్యాను ప్రేమిస్తాడు. అప్పుడే నిత్యా ఒక్క సారిగా ప్రేమకు సంబందించిన సందిగ్ధంలో పడుతోంది. సూరజ్ పై తనకు ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని గ్రహిస్తోంది. ఇటు సూరజ్ నా..అటు అభయ్ నా తేల్చుకోలేక పోతోంది. ఈ సంగతి అర్థం చేసుకున్న సూరజ్ తాను ప్రేమించిన నిఖితాను పెళ్లి చేసుకుంటాడా లేక నిత్యాకు దగ్గరవుతాడా లేదా అనేది కథ.  
విశ్లేషణ….
యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ మరోసారి యూత్‌ ఫుల్‌ క్యారెక్టర్ లో బాగానే కనిపించాడు. కాకపోతే కొన్ని సీన్స్‌ సరిగా రాలేదు. చాలా సన్నివేశాల్లో సందీప్‌ నటన బోరు కొడుతోంది. హీరోయిన్‌ అమైర దస్తూర్‌ అందంతో ఆకట్టుకుంది. నటన పర్వాలేదు. ఇంకో హీరోయిన్ త్రిదా చౌదరికి పాత్ర పరంగా పెద్దగా ఏం లేదు. కాకపోతే అందంగా కనిపిస్తోంది. ప్రియదర్శి లాంటి కమెడియన్‌ పర్వాలేదనిపించాడు. దర్శకురాలిగా పరిచయం అయిన ఘట్టమనేని మంజుల పనితనం అనుకున్నంతగా లేదనే చెప్పాలి. తొలిసారి అయినా సీనియర్ దర్శకుల్లా ఉన్నాయి కొన్ని సీన్స్. మంజుల కూతురు జాన్వీ మంచి నటనతో ఆకట్టుకుంది. రానున్న కాలంలో సినిమాలకు పనికొస్తుందని అర్థమవుతోంది. అదిత్‌ అరుణ్‌, నాజర్‌, సంజయ్‌, అనితా చౌదరిలు తమ పాత్రల మేరకు రాణించారు. .
తొలిసారి దర్శకురాలిగా మంజుల పాస్ అయినట్లే. బలమైన , సున్నితమైన అంశాన్ని సినిమా తీసుకుని మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. విరామం తర్వాత సినిమా పై ఆసక్తి పెరుగుతోంది. సందీప్ కిషన్ ను ఎంచుకోవడం మంచిది అయింది. మొత్తంగా కుటుంబ, స్నేహితులు కలిసి సరదాగా సినిమా చూడవచ్చు. 
సాంకేతికాంశాలు…
కానీ ఈ సినిమాలో కథకి తగ్గట్టు కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది. కెమెరామన్ రవి యాదవ్ పనితీరు చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్ ని బాగా చూపించడం లో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.  ఇక రాధన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనక్కు తగ్గలేదు. సినిమా చూసేందుకు అందంగా కనిపించింది. 
ప్లస్ పాయింట్లు
+ సినిమాటోగ్రఫీ
+ సంగీతం
+ కామెడీ సన్నివేశాలు
+ కెమెరా వర్క్
మైనస్ పాయింట్లు…
– సినిమా సాగదీత 
– త్రిదా చౌదరి పాత్ర
– పస్టాప్ 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.