మందకృష్ణను అణిచేస్తారట

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ. ఆయనకు ఒక స్టాండ్ అంటూ ఏమి ఉండదు. కాసేపు టీడీపీకి అనుకూలంగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడతారు. టీడీపీనే కాదు.. మిగతా పార్టీల విషయంలోను ఆయన విధానం ఇదే. అందుకే విలువ లేకుండా పోయింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత మాట మార్చారు. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ మరీ ముఖ్యంగా కేసీఆర్ కు వైరి వర్గంగా మారాడు. అందుకే అతన్ని అణచేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి లోపలేశారు. మిగతా రాజకీయ నేతల్లా ఆందోళనలు చేయడమే ఇందుకు కారణం. మందకృష్ణ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యి ట్యాంక్ బండ్ పై ఆందోళన చేయడానికి పూనుకున్నాడు. అప్పుడు ఆయనను అరెస్టు చేసి, అణిచివేశామని, ఇక ముందు కూడా అణిచివేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 
ఎస్సీ వర్గీకరణ ఇక మందకృష్ణతో కాదనీ, మాదిగ సోదరులు, విద్యార్థులు.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీనిచ్చారు గతంలో కేసీఆర్. చెప్పినట్లు చేయనివాడు కేసీఆర్ అంటారు. ఆ తర్వాత బుకాయించాడు. తాను దళితుడ్ని సిఎం చేస్తానని అసలు చెప్పలేదని అబద్దాలు ఆడాడు. మొన్నటికి మొన్న ప్రధాని మోడీ అంతటి వ్యక్తిని వాడు వీడు అన్నాడు. తెల్లారే పాటికి విమర్శలు రావడంతో పొరపాటున అలా అన్నారని.. కేటీఆర్, కవితలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ మాత్రం తాను అసలు అనలేదంటున్నాడు. మొత్తంగా కేసీఆర్ తీరును జనాలంతా తప్పు పడుతున్నారు. ఎస్సీల కోసం తానే ఉద్యమించి, వర్గీకరణ సాధిస్తానని, తనను నమ్మండని కేసీఆర్ ప్రకటించడం విచిత్రమే. 
కేసీఆర్ ఏది మాట్లాడినా దూరదృష్టి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెప్పారు. అదే సమయంలో బీజేపీ, ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ పై విమర్శల బాణం ఎక్కు పెట్టారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఇలాంటి మాటల దాడులు చేస్తుంటారన్నది నిజం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.