టీడీపీకి వ్యతిరేకంగా మహేశ్ పోస్టు

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ఓ పోస్టు రాజీకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో పవన్ ఫ్యాన్స్‌తో వివాదం జరుగుతున్న సమయంలోనే టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోస్టులు పెట్టేవారు. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన సమయంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే పవన్ ఫ్యాన్స్‌తో వివాదం తర్వాత అతడిని మీడియా పట్టించుకోవడమే మానేసింది. అయినా ఆయన మాత్రం పవన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వెబ్‌సైట్ పెట్టిన వార్తను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కత్తి మహేశ్. అది టీడీపీకి వ్యతిరేకంగా ఉండడంతో ఫ్యాన్స్ ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

లగడపాటి సర్వే న్యూస్ ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ వెబ్‌సైట్ చూసిన ఆంధ్రా ఆక్టోపస్ సర్వే ఫలితాలను తమకు నచ్చినట్లు మార్చుకుని పోస్టు చేస్తున్నారు. తాజాగా ఓ వెబ్‌సైట్ లగడపాటి ఇచ్చిన సర్వే రిపోర్టులు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారమని ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో టీడీపీకి 66, వైసీపీకి 103, జనసేనకు 6 సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలినట్లు చూపించారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసిన కత్తి మహేశ్.. 2019లో ఇదే జరగబోతుంది అన్నట్లుగా క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో టీడీపీ అభిమానులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు కత్తి మహేశ్.. గతంలో వైసీపీకి సపోర్టుగా వచ్చిన ఓ యాడ్‌లో కూడా నటించాడు. దీంతో ఆయనపై వైసీపీకి చెందిన వ్యక్తిగా ముద్ర పడిపోయింది. పవన్ కల్యాణ్, మోదీ, చంద్రబాబులను మాత్రమే కత్తి మహేశ్ విమర్శిస్తుంటాడు. ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదు. ఈ కారణంగానే కత్తి మహేశ్ వైసీపీ వ్యక్తనే అనుమానాలకు బలం చేకూరుతోంది. గతంలో సినిమాలకు రివ్యూలు చెప్పే కత్తి మహేశ్.. తెలుగులో వచ్చిన బిగ్‌బాస్ సీజన్-1 పాల్గొన్నాడు. దీని తర్వాత ఈయన చాలా ఫ్యామస్ అయిపోయాడు. తర్వాత పవన్ ఫ్యాన్స్‌తో వివాదం కారణంగా, ప్రతి రోజు ఏదో చానెల్‌లో కనిపించడంతో సెలబ్రిటీ అయిపోయాడు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.