‘మహానటి’ని ఎన్నారైలు కూడా వదల్లేదు..!

వెండితెరపై మకుటం లేని మహరాణిలా ఓ వెలుగు వెలిగిన అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా అంచనాలకు మించిన విజయం సొంతం చేసుకుంది. సినీప్రియులను కట్టిపడేసింది. సాధారణ ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీల ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేష్‌కు మంచి గుర్తింపు లభించింది. సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌తోపాటు దుల్కర్ సల్మాన్, ఇతర తారాగణం, నిర్మాతలకు ప్రశంసలు దక్కాయి. అంచనాలకు మించి విజయాన్ని అందుకున్న ఈ సినిమా రికార్డుస్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా ఓవర్సిస్‌లో ఈ సినిమా కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. పలు టాప్ సినిమాలను వెనక్కు నెట్టి హిట్ సినిమాల జాబితాలో దూసుకెళ్తోంది.

యూఎస్‌లోని పలు లొకేషన్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. దీంతో యూఎస్‌ బాక్సాఫీస్ వద్ద టాప్‌లో నిలిచిన పలు సినిమాలను వెనక్కు నెట్టింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక గ్రాస్‌ను రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్‌లో ఓ ఫొటోని షేర్ చేసింది. బాహుబలి-2, బాహుబలి, రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు తర్వాతి స్థానంలో మహానటి నిలిచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.