మహానాడుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు వెళ్లలేదంటే..

కర్నూలు జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎప్పుడు ఎటువైపు నేతలు వెళతారో అర్థం కాని పరిస్థితి. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురేసి నేతలు ఉన్నారు.వారిలో వారికి పొసగడం లేదు. సరిద్దిద్దే ప్రయత్నాలు సాగుతున్నా ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. వారే కాదు… ఇంకా కొత్త వారిని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బనగానపల్లి ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి. మంత్రి అఖిల ప్రియ మధ్య గొడవలున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పండ్లాపురం రామిరెడ్డికి రూ.100 కోట్ల పనులను అప్పగించారు మంత్రి అఖిల ప్రియ. అంతే కాదు..నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లెలోను అతని హవా కొనసాగుతోంది. అదే విషయం పై మంత్రి అఖిలకు చెప్పినా వినడం లేదంటున్నారు. అనేక సార్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఇక సిఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడేందుకు సిద్దమయ్యారాయన. అందుకే జిల్లా మినీ మహానాడుకు హాజరు కాలేదు. అంతెందుకు తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు వెళ్లలేదు. ఫలితంగా టీడీపీలోనే నేతలు ఆయన తీరును తప్పుపడుతున్నారు.

ఏదన్నా ఉంటే మీరు మీరు మాట్లాడుకోవాలి. అంతేగానీ..పార్టీ పండుగకు దూరంగా ఉంటారా..ఇది పద్దతి కాదంటున్నారు. బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి ఇటీవల నామినేటెడ్ పోస్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన చల్లాకు ఆర్టీసీ ప్రాంతీయ రీజినల్ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు చంద్రబాబు. అసలు ఒక్కసారి గెలవని వర్ల రామయ్యకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా తాను పదవిని తీసుకునేదిలేదని చెప్పారు చల్లా. చివరకు ఆయన్ను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించి శాంతింపజేశారు. చల్లా విషయంలో టీడీపీ వైఖరికి నిరసన తెలిపారు ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి.

ఇక కర్నూలు నగరంలో ఎస్వీ మోహన్ రెడ్డి, టిజి భరత్ ల మధ్య వైరం నెలకుంది. సీటు విషయంలో ఎవరికి వారుపట్టుదలగా ఉండటమే ఇందుకు కారణం. ఎంపీ టిజి వెంకటేష్ కుమారుడే భరత్. రాజకీయంగా అడుగు పెట్టేందుకు సిద్దమవుతున్నారు భరత్. తొందరపడి కోయినా ముందే కూసింది లా ఉంది ఆయన వ్యవహారం. కర్నూలులో పోటీ చేసేది తానేనంటూ ముందే వాదనకు దిగారు. అక్కడే కాదు..పాణ్యం సీటు విషయంలో ఏరాసు ప్రతాపరెడ్డితో పాటు..బైరెడ్డి వర్గాల మధ్య ముందే పోటీ నెలకుంది. మొత్తంగా కర్నూలు జిల్లాలో పార్టీ నేతల మధ్య వైరాన్ని తగ్గించక పోతే ఇబ్బందిపడక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.