ఎన్టీఆర్ వల్ల ఆ రోడ్డుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది..!

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా జరిగే మహానాడు వల్ల విజయవాడలోని ఓ రోడ్డుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. టీడీపీ ఆవిర్భవించాక తొలి మహానాడును 1983లో విజయవాడ తూర్పు ప్రాంతంలో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు ‘మహానాడు రోడ్డు’గా నామకరణం చేశారు. సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి ఎదురుగా ఉన్న సుమారు 150-200 ఎకరాల పొలాలను అప్పట్లో మహానాడుకు వేదికగా నిర్ణయించారు. ఆ సమయంలో ఇటువైపు రావాలంటే డొంకరోడ్డు తప్ప వేరే మార్గం ఉండేది కాదు. దీంతో మహానాడు కోసం ప్రత్యేకంగా రోడ్డు వేశారు. అలా అప్పుడు మహానాడు జరిగిన సమయం నుంచి ఈ రోడ్డుకు ‘మహానాడు రోడ్డు’ అనే పేరు స్థిరపడిపోయింది. అప్పుడు మహానాడు జరిగిన ప్రాంతాల్లో ఇప్పుడు కామినేని నగర్‌, గణేష్‌ కాలనీ, శ్రీరామచంద్ర నగర్‌ వంటి కాలనీలు ఏర్పడ్డాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.