అమెరికా లోని డల్లాస్ లో టీడీపీ మహానాడు కి భారీ ఎర్పాట్లు

తెలుగుజాతి వెలుగురేఖగా ఉదయించి, తెలుగుతల్లి కీర్తిపతాకను దశదిశలా వ్యాపింపచేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తం గా వున్న తెలుగువారు మహానాడుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అమెరికాలోని వివిధ నగరాల్లో క్రమం తప్పకుండా తెలుగువారు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అమెరికాలోని ప్రవాసాంధ్రులందరూ కలసి డల్లాస్ మహానగరం లో మే 27, 28 తారీఖుల్లో “అమెరికా మహానాడు” నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏర్పాట్లులో భాగస్వాములవ్వడానికి వందలాది కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వివిధ విభాగాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ మహాసభలకి తెలుగు రాష్ట్రాలనుండి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, అనేకమంది ప్రముఖ పార్టీ నాయకులు, అమెరికాలోని వివిధ రాష్ట్రాలనుండి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అతిథులుగా విచ్చేస్తున్నారు. సభా జరిగే ప్రదేశానికి ఎన్టీఆర్ ప్రాగణం గా నామకరణం చేసారు. ఈవేదిక నుంచి వివిధ తీర్మానాలు చేసి పార్టీ ఆఫీస్ కి పంపించే విధం గా ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ లో జరిగే మహానాడు ని విజయవాడలో జరిగే మహానాడు కి అనుసంధానం చేస్తామన్నారు. డల్లాస్ తెలుగుదేశం ఆద్వర్యం లో అతిథులకు కావలసిన బస, ట్రాన్స్పోర్టేషన్ , రుచికరమైన వంటకాల మరియు వినోదభరిత సాంస్కృతిక కార్యక్రమాలు రూపకల్పన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అభిమానులైన మీరందరు బంధుమిత్ర కుటుంబసమేతంగా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.