శివాజీరాజా.. ఏందీ గోల్‌మాల్ ముచ్చ‌ట‌!

మా అసోసియేష‌న్‌.. ఏదో సినిమావాళ్ల క‌ష్ట‌సుఖాలు చ‌ర్చించుకునేందుకు ఓ సంస్థ‌. వెండితెర‌పై వెలిగిన త‌రువాత‌.. ఆన‌క‌.. ఏదైనా చీక‌టి ప‌లుక‌రిస్తే.. ఓదార్చేందుకు ఓ వేదిక‌. ల‌క్ష‌లు.. కోట్లు సేక‌ర‌ణ‌. పేద సినీ క‌ళాకారుల కోసం ఆర్జింపు. మొత్తంమ్మీద‌.. అక్క‌డా ఓ సేవా భావం ఉంద‌నే ఆలోచ‌న త‌డుతుంది. అయితే.. శ్రీరెడ్డి దెబ్బ‌కు.. మా సంఘం రోడ్డున ప‌డిపోయింది. సారీ.. ప‌రువు బ‌జార్ను ప‌డిన‌ట్ల‌యింది. క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు తెరిచేందుకు మ‌హిళా సిబ్బంది, క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్స్‌పై జ‌రిగే వేధింపుల‌ను చెప్పుకునేందుకు క‌నీసం చ‌ట్టాన్ని అక్క‌డ అమ‌లు చేయ‌ట్లేదంటూ.. శ్రీరెడ్డి చేసిన హాట్‌కామంట్స్‌.. జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘానికి చెవిన‌ప‌డ్డాయి. అంతే.. ఆగ‌మేఘాల మీద విచార‌ణ‌కు ఆదేశించింది. అంత‌క‌ముందు.. మా సంఘ ఎన్నిక‌ల్లో మెగాస్టార్ వ‌ర్సెస్ ముర‌ళీమోహ‌న్ అన్న‌ట్లుగా హోరాహోరీ పోరు జ‌రిగింది. ఓ న‌టి అయితే.. ఏకంగా పెద్ద‌నోరేసుకుని మ‌రీ విరుసుకుప‌డింది. మెగాఫ్యామిలీ నుంచి నాగ‌బాబు జోక్యం చేసుకుని మ‌రీ.. శివాజీరాజాను గెలిపించాడు. శ్రీకాంత్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌య‌సుధ‌.. ఇలా చాలామందికి.. అసోసియేష‌న్‌లో స‌భ్య‌త్వం.. పెత్త‌నం ఉంద‌నే చెప్పాలి. ఇప్పుడెందుకీ ముచ్చ‌ట అంటే.. మా సంస్థ‌లో ల‌క్ష‌లాదిరూపాయ‌ల గోల్‌మాల్ జ‌రిగిన‌ట్లు బ‌య‌ట‌కు పొక్కింది. పైగా.. కొంద‌రు సీనియ‌ర్ న‌టుల క‌నుస‌న్న‌ల్లో అమెరికాలో జ‌రిగిన కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన డ‌బ్బులు బ‌య‌ట‌కు త‌ర‌లినట్టుగా స‌మాచారం. దీనిపై శివాజీరాజా స్వ‌యంగా మీడియాకు లీకులిచ్చారు. పైగా రికార్డుల‌న్నీ స్వాధీనం చేసుకుని గ‌దిలో వుంచి తాళం వేశార‌ట‌. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో సూత్ర‌దారి.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేష్‌, శ్రీకాంత్ అంటూ.. ఎవ‌రికి వారు.. నోటికి వ‌చ్చిన పేర్లు చెబుతున్నారు. మ‌రి.. ఇప్ప‌టి వ‌ర‌కూ గుట్టుగా ఉన్న విష‌యం ఎందుకు బ‌య‌ట‌కు పొక్కింది.. ఇప్పుడే ఎందుకీ ర‌చ్చ మొద‌లుపెట్టార‌నేది మాత్రం స‌స్పెన్స్‌. ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదారు నెల‌లుండ‌గా.. మా డ‌బ్బు గోల్‌మాల్ హాట్ టాపిక్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల వేళ దెబ్బ‌తిన్న ప్యానెల్ ఎలాగైనా.. ఈ ద‌ఫా.. శివాజీరాజాను బ‌య‌ట‌కు పంపి.. ప‌వ‌ర్‌లోకి రావాల‌నే యోచ‌న‌లో ఉంది. కానీ.. శివాజీరాజా మ‌రోసారి తానే చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. మ‌రి.. ఇప్పుడు జ‌రిగిన నిధుల దుర్వినియోగం.. ఎవ‌రికి మేలు చేస్తుందో.. మ‌రెవ‌ర్ని బ‌జారుకు ఈడ్చుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.