ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు పోటీ చేసేది ఎక్కడ. ఏ నియోజకవర్గం.. ఇదంతా ఇప్పుడు టీడీపీలో రసవత్తరమైన చర్చ. ఆయనతోపాటు.. కోడలు బ్రాహ్మణి కూడా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఇదంతా పార్టీ శ్రేణుల్లో కాస్త తడబాటుకు కారణమవుతోంది కూడా. ఎందుకంటే.. గతంలో బాలయ్య హిందూపూర్ నుంచి బరిలోకి దిగితే.. అక్కడ సీటుపై ఆశలు పెట్టుకున్న నేత కలత చెందాడు. ఇప్పుడు లోకేష్, బ్రాహ్మణి కూడా క్యూ కడితే.. ఎవరు తమ సీటును త్యాగం చేయాలనేది కూడా మరో ప్రశ్న. బ్రాహ్మణి సంగతి పక్కనబెడితే.. చినబాబును ఎక్కడ నుంచి రంగంలోకి దింపాలనేది బాబును కూడా ఆందోళనకు గురిచేస్తోందని సమాచారం. ఎందుకంటే.. గెలుపోటములు.. ఎంతటివారినైనా ఆటాడుకోగలవు. పైగా లోకేష్‌బాబుకు ఇప్పటికీ పూర్తిస్థాయి రాజకీయాలు ఒంటబట్టలేదు. పైగా ఎవరు సీటుకు ఎసరుపెట్టినా.. వారు.. నవ్వుతూనే ప్రతీకారం తీర్చుకునే ఎత్తుగడ వేయకపోతారా! అనే అనుమానం కూడా సీనియర్లతో ఉంది. పోన్లే.. చిత్తూరులో నగరి ఇద్దామంటే.. ముద్దుకృష్ణమనాయుడు బంధుగణం ఉంది. ఇక కృష్ణా, గుంటూరుల్లో కమ్మసామాజికవర్గం అధికంగా వున్న చోటి నుంచి మాత్రమే చినబాబును బరిలోకి దింపాలనేది ఫైనల్‌గా పార్టీ నిర్ణయించిన అంశం. ఎందుకంటే.. ఇక్కడ ఎన్టీఆర్ మనువడిగా లోకేష్‌పై అభిమానం.. కాస్త సెంటమెంట్ కూడా వర్కవుట్ అవుతుందని అధినేత చంద్రబాబు ఆలోచన కూడా నట.
పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తయారైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి. ప్రత్యేక హోదా కావాలని ఒకసారి, దాని కంటే ప్యాకేజి మంచిదని మరోసారి, హోదా ఏమైనా సంజీవినా అనే ఇంకోసారి చెప్పారు. ఇప్పుడు ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటున్నారు. ఇది టీడీపీని ఇరకాటంలో […]
రాష్ట్ర విభజనలో అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నట్లు. నేను కేసీఆర్ తాటతీస్తా అని అన్నారు గతంలో జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సి.ఎం కేసీఆర్ దేశానికే ఆదర్శమన్నారు. రాజకీయాలు ఇప్పుడే వంట బట్టించుకుంటున్నాడు పవన్. పార్టీ పెట్టిన నాలుగేళ్లకు సభ్యత్వం […]
దేశంలోని జాతీయ రహదారులు, నగరాలలో నిర్మించే రోడ్ల నాణ్యతపై ప్రజలు ఎప్పటికీ అసంతృప్తితోనే ఉంటారు. రోడ్డు వేసిన ఆరు నెలలకు కుంగిపోవడం….బీటలు వారడం….గుంతలు పడడం వంటివి జరగడంతో వారు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే, వందల కోట్లు ఖర్చు పెట్టిన రోడ్లను ఆధునీకరించినా…మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో […]
Be the first to comment